Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీట్‌రూట్ జ్యూస్‌తో నిత్య యవ్వనం మీ సొంతం.. ఎలా?

Advertiesment
Beetroot The elixir of youth...
, శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (09:05 IST)
నిత్యం యవ్వనంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఉబలాటపడుతుంటారు. మరింత యవ్వనంగా కనపడేందుకు బీట్‌రూట్ రసం సేవిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, బీటా కెరోటిన్‌లతో పాటు పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయని, అలాగే, ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. 
 
బీట్‌రూట్ ముదురు ఎరుపు రంగును సంతరించుకునేందుకు ప్రధాన కారణం ఇందులో ఆంధో సైనడిన్లుండటమేనని పరిశోధకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయాన్నే పరకడుపున బీట్‌రూట్ రసాన్ని సేవిస్తే శరీరానికి కావలసిన రక్త శాతాన్ని మరింతగా పెంచుతుంది. ఇందులోనున్న పీచుపదార్థం రక్తకణాలపైనున్న అధిక కొవ్వును తొలగించి, మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. బీట్‌రూట్‌లో బిటైన్ అనే పోషకం అధికంగా ఉండటం మూలాన శరీరంలో నిల్వవున్న చెడు కొవ్వును కరిగించి వేస్తుంది. దీంతో నిత్యం యవ్వనులుగా ఉంటారని వైద్యులు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu