Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవధాన్యాల ఉపయోగాలేంటో మీకు తెలుసా?

నవధాన్యాల ఉపయోగాలేంటో మీకు తెలుసా?
, శుక్రవారం, 29 జనవరి 2016 (10:46 IST)
నవధాన్యాలు గురించి అందరికి తెలిసినా వాటి ఉపయోగాలు కొంతమందికి మాత్రమే తెలుసు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని ఎంతో ఖర్చు పెట్టి ఆస్పత్రులకు వెళ్ళడం కన్నా గుప్పెడు పప్పుధాన్యాలు తీసుకుంటే ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉందడవచ్చు.
 
పెసర్లు, బొబ్బెర్లు, రాగులు, శెనగలు, బఠానీ, పల్లీలు, చిక్కుడు గింజలు, వీటితో పాటు బాదాం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ శరీర అవసరాలకు సరిపోయే పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. వీటిని ఉడికించి తినడం వల్ల ఎన్నో లాభాలు చేకురుతాయి. ఒక కప్పు పప్పుధాన్యాల్లో దాదాపు 18 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి. 
 
పప్పుధాన్యాలలో ప్రొటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎముకల, కండారాల పటుత్వాన్ని మెరుగపరుస్తుంది. వీటిలో శరీర పోషణకు అవసరమైన క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఈ పప్పుధాన్యాలు గుండె‌కు సంబంధించిన జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది. 
 
పప్పుధాన్యాల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వల్ల ఒక కప్పు ధాన్యం తినడంతోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ విధంగా ఎక్కువగా తినలేకపోవడం వలన బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. ఈ ధాన్యాల్లో గ్లైసిమిక్, ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన ఆకలి కూడా తొందరగా వేయదు. 
 
అంతేకాక వీటిని తరుచూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. చాలా మంది వృద్ధుల్లో జింక్, ఐరన్ మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, లోపాలు ఉంటాయి. వీటన్నింటికి పప్పుధాన్యాలు ఎంతో సహకరిస్తుంది. వీటికి సులభంగా జీర్ణమయ్యే లక్షణం ఉండడం వల్ల అన్ని వయసులవారికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu