అరటి పండు ఆకలిని తీర్చుతుంది. అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెపుతారు. అరటి కాండంను తింటే కలిగే ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
అరటి కాండంలో పీచుపదార్థం వుంటుంది, అందువల్ల దీనిని తీసుకుంటుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.
అరటి కాండంలో విటమిన్ బి6తో పాటు పొటాషియం వుంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి.
లేత అరటి కాండం రసాన్ని తీసుకుంటే ట్యుబర్క్యులోసిస్ బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.
అరటి కాండం రసం తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి.
కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ లోని రాళ్లను అరటి కాండం రసం తగ్గిస్తుందని చెపుతారు.
మలబద్ధకం సమస్య వున్నవారు అరటి కాండం కూరను తింటుంటే సమస్య తీరుతుంది.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుల సలహా అవసరం.