Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో మామిడి తింటే వేడి చేస్తుందా.. తినొచ్చా తినకూడదా?

వేసవిలో మామిడి తింటే వేడి చేస్తుందా.. తినొచ్చా తినకూడదా?
, మంగళవారం, 3 మే 2016 (16:22 IST)
వేసవిలో లభించే మామిడిని అధికంగా తీసుకోకూడదని.. అధికంగా తింటే వేడి చేస్తుందని పెద్దలంటుంటారు. అయితే సాధారణంగా ఆయా సీజన్లలో లభించే పండ్లను తీసుకోవడం ద్వారా ఆ సీజన్‌లో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. ఈ క్రమంలో మామిడిని అధికంగా తీసుకోవడం ద్వారా వేడి చేస్తుందని, వేడి గడ్డలు వస్తాయని చెప్పే మాటల్లో నిజం లేదని వారంటున్నారు. వేసవిలో దొరికే మామిడి, పుచ్చకాయ వంటి వాటిల్లో ఖనిజ లవణాలు మస్తుగా ఉంటాయని.. ఇవి వడదెబ్బ తగలకుండా శరీరానికి శక్తినిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత వేసవిలో లభించే పండ్లు తీసుకుంటే లాభాలేంటో చూద్దాం.. 
 
మామిడి: తీయతీయటి మామిడి తింటేనే వేసవి మజా. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లను ఎవ్వరూ మిస్‌ అవ్వరు. పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ రారాజే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఈ రోజుల్లో ఎక్కువమందిని భయపెడుతున్న క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే గుణం మామిడికి ఉంది. కొలోన్‌, బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్లను వీలైనంత వరకు మామిడి అరికడుతుంది. వీటితోపాటు కొవ్వును తగ్గించగలిగే మరో మంచి గుణం ఈ పండులో ఉంది. 
 
పుచ్చకాయ: అత్యధిక పీచు, నీళ్లు కలిగిన పండ్లలో ముఖ్యమైనది పుచ్చకాయ. ఎండాకాలం వడదెబ్బ కొట్టకుండా కాపాడటంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. దీనిలో ''లైకోపిన్''’ అనే ఔషధగుణం కలిగి ఉండడం వల్ల మండే ఎండలకు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టు రాలడం, అజీర్తి, కనుచూపు మందగింపు వంటి సమస్యలను తగ్గిస్తుందీ పండు. గుండె జబ్బులను అడ్డుకునే శక్తి కూడా దీనికుంది.
 
కొబ్బరి నీళ్లుతాగేందుకు రుచిగా ఉండడమే కాదు ఏ ఇతర పండ్లు అందించనన్ని మేలు చేకూరుతుంది. ఎండాకాలంలో దప్పిక తీరేందుకు అందరూ శీతలపానీయాలు తాగుతుంటారు. వాటికి బదులు కొబ్బరి నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది. ఆ ప్రయోజనానికి తోడు వేడి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోటైట్లు సమకూరుతాయి. శరీరం కూడా వెంటనే చల్లబడుతుంది. మూత్రపిండాలను శుభ్రపరిచేందుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లు కిడ్నీలో రాళ్లను రాకుండా చూస్తుంది. యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ను రానివ్వవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొడిదగ్గుతో ఇబ్బందా.. నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది