Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

70 శాతం వరకు తక్కువ ధరకు అన్న సంజీవనీ మందులు

రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవని మందుల వినియోగాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 250 అన్న సంజీవనీ కేంద్రాలు పనిచేస్తుండగా వాటి సంఖ్యను మరో వెయ్యికి పెంచాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప

70 శాతం వరకు తక్కువ ధరకు అన్న సంజీవనీ మందులు
, మంగళవారం, 15 నవంబరు 2016 (19:16 IST)
రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవని మందుల వినియోగాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 250 అన్న సంజీవనీ కేంద్రాలు పనిచేస్తుండగా వాటి సంఖ్యను మరో వెయ్యికి పెంచాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంత మహిళలకు కొత్తగా ఏర్పాటు చేయబోయే అన్న సంజీవని జెనరిక్ మెడికల్ షాపులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
రాష్ట్ర ప్రజలకు అన్న జెనరిక్ మెడికల్ షాపులను వినియోగించేలా ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది. ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమన మందులు లభ్యమవుతున్నప్పుడు... ఎక్కువ ధర పెట్టి పలు కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి అవసరం లేదని... వైద్యానికి వెచ్చించే ఖర్చును పెద్ద ఎత్తున తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 
 
పేద ప్రజలు వినియోగించే పలు జబ్బులకు సంబంధించి మందులను 50 నుంచి 70 శాతం తక్కువ ధరకు విక్రయిస్తోంది. వాటిలో భాగంగా ఏఏ మందులు ఎంత ధరకు అందుబాటులోకి వస్తాయన్న వివరాలను మీకు అందిస్తున్నాం. అన్న సంజీవనీ మెడికల్స్ షాపులో నిత్యం మనం ఎదుర్కొనే అనేక జబ్బులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకు ఈ మందులను సామాన్య ప్రజలు కొనుగోలు చేయాలని వైద్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. 
 
జెనరిక్ మందులంటే ఏంటి? 
ఒకే రకమైన మందును పలు పేర్లతో వివిధ మందుల కంపెనీలు తయారుచేస్తూ... వాటికి మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా విక్రయాలు జరుపుతుంటాయి. ఆయా మందులను కంపెనీలు తమ బ్రాండ్లకు అనుగుణంగా ఆకర్షణీయంగా మార్చుకోవడం వల్ల ఆయా మందుల ధరలు 20 నుంచి 100 శాతం వరకు అత్యధిక ధరకు విక్రయిస్తుంటాయి. అదే సమయంలో ఏ బ్రాండ్ పేరు లేకుండా అందులో ఉండే మందును ఆయా పేర్లతో  మార్కెట్లోకి  నేరుగా వినియోగదారులకు విక్రయించే మందులను జనరిక్ ఔషదాలని పిలుస్తారు. 
 
జెనరిక్ మెడిసిన్లు ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నారు?
కంపెనీల నుండి నేరుగా అన్న సంజీవని కేంద్రాలకు మందులు రావడంతో ఎలాంటి పన్నులు, డీలర్ల కమిషన్లు లేకపోవడం వలన చౌక ధరలకు ప్రజలకు అందించడం జరుగుతుంది. అలాగే మందుల పేటెంట్ కాలం పూర్తయిన తర్వాత సదరు కాంబినేషన్లో ఇతర కంపెనీల వారు కూడా అవే మందులను జనరిక్ మందులుగా ఉత్పత్తి చేసి తక్కువ ధరలకు అందిస్తారు. 
 
భవిష్యత్‌లో జెనరిక్ మెడిసిన్లదే హవా
వచ్చే రోజుల్లో జెనరిక్ మెడికల్ షాపులు విస్తృతమవుడం ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల జెనరిక్ మెడిసిన్లను ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. తద్వారా పేదల వైద్యం చౌకగా అవడం పేదలకు భరోసాగా నిలుస్తోంది. పేదలకు వైద్యం ఇక వ్యయభరితం కాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతమ్మ పాదాలను రామయ్య తాకి ప్రణయ కోపాన్ని తీర్చాడా?