Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెుక్కజొన్న, ఉప్పుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

Advertiesment
మెుక్కజొన్న, ఉప్పుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
, గురువారం, 25 అక్టోబరు 2018 (10:24 IST)
మెుక్కజొన్నలతో ఉప్మాలు, పులావ్, హల్వా వంటి వంటలు కూడా తయారుచేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి అవసరమైయ్యే పోషక విలువలను అందిస్తుంది.
 
100 గ్రాముల మెుక్కజొన్నల్లో 86 క్యాలరీలు ఉంటాయి. ఆకలి నియంత్రణను పెంచుతుంది. దీనిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెుక్కజొన్నలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వృద్ధాప్య ఛాయలు నుండి విముక్తి కలిగిస్తాయి. కొందరికి చిన్న వయస్సులోని కంటిచూపు అంతంగా కనిపించకుండా ఉంటుంది.
 
అలాంటప్పుడు చలికాలంలో దొరికే ఈ మెుక్కజొన్నను ప్రతిరోజూ ఉడికించి తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలామంది వీటిని ఉకిచించి తీసుకోవడం మానేసి.. కాల్చుకుని తింటుంటారు. మెుక్కజొన్నను అలా కాల్చి సేవిస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు.. ఈ స్వీట్‌కార్న్ తీసుకుంటే నెలరోజుల్లో మీడియమ్ సైజ్ బరువుకు వచ్చేస్తారు. 
 
మెుక్కజొన్నలోని ఫోలెట్ అనే పదార్థం గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. చిన్నపిల్లలకు స్నాక్స్‌ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఏం చేయాలంటే మెుక్కజొన్నలను ఉడికించి వాటిని విరివిగా తీసి ఓ బౌల్‌లో వేసి అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని చిన్నారులకు ఇస్తే.. ఇష్టపడి తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన శృంగారంలో చాలా వీక్‌గా వుంటున్నారు... ఏమై వుంటుంది...