గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే. గ్రీన్ టీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల గ్రీన్ టీల కోసం భారీగా ఖర్చు చేయడాన్ని తగ్గించుకోండని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా అధ్యయనంలో బ్లాక్ టీలో కాసింత వేడిపాలును కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ హెల్త్ ప్రాపర్టీస్, బ్లాక్ టీ ప్రాపర్టీస్‌పై జరిగిన పరిశోధనలో గ్రీన్ కంటే బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది.
దీనిపై ఫ్రీలాన్స్ డైటీషియన్ డాక్టర్ క్యారీ రక్స్‌టన్ మాట్లాడుతూ.. గ్రీన్ టీ కంటే.. బ్లాక్ టీని సేవించడం వల్ల కేన్సర్, స్ట్రోక్, డయాబెటీస్, నోటి సమస్యలు వంటివి తగ్గుతాయన్నారు.
అయితే తమ అధ్యయనం రెండు రకాల టీలపై సాగినట్టు చెప్పారు. ఇందులో ఒకే తరహా ప్రతిఫలాలు ఉన్నట్టు తేలిందన్నారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటులు చాలా వరకు తగ్గినట్టు ఆయన తెలిపారు.