Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటిని శుభ్రంగా వుంచుకోవట్లేదా? అయితే ప్లాస్టిక్ భోజనం తింటున్నట్లే.. ఎలా?

ఇంటిని శుభ్రంగా వుంచుకుంటున్నారా? ఇల్లు శుభ్రంగా లేకపోతే.. కలుషితమైన ఆహారం తీసుకున్నట్లేనని తాజా అధ్యయనంలో తేలింది. ఎలాగంటే.. ఇంట్లో మనం వుపయోగించే ఫర్నిచర్లపై కప్పే సోఫా కవర్లు, కర్టెన్లు, సింథటిక్

Advertiesment
plastic bags
, శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:06 IST)
ఇంటిని శుభ్రంగా వుంచుకుంటున్నారా? ఇల్లు శుభ్రంగా లేకపోతే.. కలుషితమైన ఆహారం తీసుకున్నట్లేనని తాజా అధ్యయనంలో తేలింది. ఎలాగంటే..  ఇంట్లో మనం వుపయోగించే ఫర్నిచర్లపై కప్పే సోఫా కవర్లు, కర్టెన్లు, సింథటిక్ వస్త్రాల రేణువులు ఇంట్లోని దుమ్ములోకి చేరి చివరికి అవి భోజన ప్లేట్లలోకి వస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. 
 
దుమ్ము ధూళిలో ప్లాస్టిక్ సులభంగా కలిసిపోతుందని.. ఆ రేణువులు ఆరోగ్యానికి పెద్ద మహమ్మారిగా తయారవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. తక్కువ బరువున్న ప్లాస్టిక్ వస్తువుల్లోని రేణువులు దుమ్ములో చేరి.. చివరికి అందులోని రసాయనాలు ఆహారంలో చేరి ఆరోగ్యాన్ని కబళిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. 
 
ఇంకా సోఫాలపై ఉపయోగించే కవర్లు, సింథటిక్ వస్త్రాల రేణువులు ఇంట్లోని దుమ్ములోకి చేరి చివరికి మనం ఆహారం తీసుకునే ప్లేటుల్లోకి వస్తున్నాయని బ్రిటన్‌లోని హెరియాట్ వాట్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ప్లాస్టిక్‌తో కూడిన దుమ్ము టేబుల్స్‌ను అంటి పెట్టుకుని అక్కడి నుంచి భోజన ప్లేటుల్లోకి చేరుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలాచేరిన ప్లాస్టిక్ రేణువులు మన కంటికి కనిపించకపోవడంతో అవి ఆహారంతో కలిసి మన శరీరంలో చేరిపోతున్నాయని ఇలా ఓ వ్యక్తి సగటున ఏడాదికి 68,415 ప్లాస్టిక్ ఫైబర్లను తింటున్నట్లు తెలిపారు. రోజుకు వంద ప్లాస్టిక్ రేణువులు మనం తీసుకునే ఆహారంలో కలిసిపోతున్నాయని.. అలా కలుషిత ఆహారాన్ని తీసుకుంటున్నామని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
కాబట్టి వారానికి ఓసారైనా ఇంటిని శుభ్రం చేయాలని.. సోఫా కవర్లు ప్లాస్టిక్ కాకుండా చూసుకోవాలి. అలాగే సింథటిక్ వస్త్రాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటిని డైనింగ్ రూమ్‌కు వంటగదికి దూరంగా వుంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో పెరుగు తప్పనిసరి.. చెమటకు చెక్ పెట్టాలంటే... గుమ్మడి గింజల్ని?