Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భవతులు పచ్చిపాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు తీసుకుంటే?

Advertiesment
A Food Guide for Pregnant Women: What to Eat and What Not to Eat
, శనివారం, 14 మే 2016 (10:35 IST)
ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. పెళ్ళైన ప్రతి స్త్రీ అమ్మ అని ఎప్పుడు పిలిపించుకుంటానా అని ఆశగా ఎదురుచూస్తుంది. గర్భం దాల్చిన తర్వాత స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఆహారం శిశువు పెరుగుదలకు సహకరిస్తుంది. ఇలాంటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే టెన్షన్ ప్రతి మహిళకుంటుంది. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే తల్లికి, బిడ్డకు క్షేమం కాదు. కాబట్టి ఆహారం విషయంలో ఏం తింటే మంచిది, ఏది తినకూడదు అనే విషయాన్ని తెలుసుకుని తినాలి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాలు, విటమిన్స్‌, ఖనిజాలు రోజు క్రమంగా తీసుకోవాలి. ఆహారాలు ఆరోగ్యకరమైనవే అయినా కొన్ని ఆహారాలు గర్భవతులకు మంచిది కాదు. అలాంటి ఆహారలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
 
పచ్చిపాలతో తయారైన ఎటువంటి పదార్థాలను తీసుకోకూడదు. వీటిని సేవించడం వలన అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ పాల ఉత్పత్తులు పుట్టబోయే బిడ్డపైన ప్రభావం చూపుతాయి. కాబట్టి పచ్చిపాలను గర్భిణీ స్త్రీలు అసలు తీసుకోకూడదు. 
 
గర్భంతో ఉన్నప్పుడు సీఫుడ్స్‌కి దూరంగా ఉంచాలి. సముద్రంలో దొరికే ఎటువంటి ఫుడ్స్‌ని తినకూడదు. ఈ సీఫుడ్స్‌ వల్ల బ్యాక్టీరియా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ ఫుడ్స్‌లో లభించే ఎక్కువ మెర్క్యురీ శాతం బిడ్డకు మంచిది కాదు హాని కలిగిస్తాయి అందువల్ల సీఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
 
ప్రెగ్నెన్సీ సమయంలో సాఫ్ట్ చీజ్‌కి దూరంగా ఉండటం చాలా వరకు మంచిది. సాఫ్ట్ చీజ్‌లో ఉండే లిస్టేరియా, బ్యాక్టీరియా ఆరోగ్యానికి ముప్పు తెస్తుంది. అందువల్ల గర్భం దాల్చిన సమయం నుండి బిడ్డను కనేవరకు జాగ్రత్త వహిస్తూ మంచి ఆహరం తినడం ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింక్ కలర్ అమ్మాయిలను మగాళ్ళకు తెగ ఇష్టపడతారట!