Top 8 health benefits of coffee and tea: నిర్దేశించిన మోతాదులో కాఫీని సేవిస్తే పార్కిన్సన్స్, టైప్ 2 మధుమేహం, కాలేయ సిర్రోసిస్ తదితర సమస్యలను అడ్డుకుంటుంది. టీ తాగటం వల్ల కిడ్నీ స్టోన్స్, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. కాఫీ, టీలు సేవిస్తే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
బ్లాక్ టీ తాగితే రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాఫీ, గ్రీన్ టీ సేవిస్తుంటే రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి.
కాఫీలో యాంటీఆక్సిడెంట్లు న్యూరాన్‌లను రక్షించి అల్జీమర్స్ వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి.
కాఫీ పిత్తాశయం ద్వారా ద్రవాన్ని తరలించి గాల్ బ్లాడర్ రాళ్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
కాఫీ, టీ రెండింటిలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి రక్త నాళాలను రక్షించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
రోజువారీ నిర్దేశిత మోతాదులో కాఫీ తాగితే బరువు నిర్వహణలో సహాయపడవచ్చు.
చామంతి పూల టీ తాగితే అది నిద్రకు సహాయపడవచ్చు.
అల్లం టీ తాగితే వికారం, వాంతుల చికిత్సకు సహాయపడుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.