అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది.
పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి.
దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి
ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.
మలబద్ధకం, ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీర బలహీనతను తొలగించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.