Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీజీ చెప్పిన 5 ఆరోగ్య సూత్రాలు!

Advertiesment
గాంధీజీ చెప్పిన 5 ఆరోగ్య సూత్రాలు!
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:36 IST)
పూర్వకాలంలో మన పెద్దలు దాదాపు 100 సంవత్సరాలకు పైబడి బ్రతికేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య అరవైకి చేరింది. దానికి కారణం మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు వారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

మనం బ్రతికినంత కాలం మంచి ఆరోగ్యం మన సొంతం కావాలంటే,గాంధీజీ గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలి. అక్టోబర్ 2, 2021న గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ గారిని గుర్తుచేసుకుంటూ అతను ఫాలో అయిన ఆరోగ్య సూత్రాలు గురించి తెలుసుకుందాం.
 
పచ్చి కూరగాయలు: గాంధీజీ తన ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు. తన ఆహారంలో భాగంగా పచ్చి కూరగాయలను ఎక్కువగా తినడానికి ఇష్టపడే వారు. పచ్చి కూరగాయల లో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు అధిక భాగం మన శరీరం లోకి వెళ్లడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది. పచ్చి కూరగాయలు అన్నింటినీ కలిపి సలాడ్ చేసుకొని తాగడం, లేదా అలాగే తినడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది గాంధీజీ గారి ఆహారంలో పచ్చి కూరగాయలు ఒక భాగం.
 
బెల్లం: గాంధీజీ చేసుకునే ప్రతి వంటకాలలో బెల్లం తప్పకుండా ఉపయోగించేవారు. కానీ కొంతకాలానికి బెల్లం కనుమరుగైపోయే ప్రతి వంటకాలలో చక్కెరను ఉపయోగించారు. దానివల్ల ప్రస్తుతం ప్రతి ఒక్కరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. గాంధీజీ తన వంటకాల ను బెల్లం తోనే ప్రారంభించేవారు. బెల్లంతో తయారు చేసిన కాఫీ లేదా టీ రుచికి ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 
పాలిష్ చేయని బియ్యం: గాంధీజీ అప్పటి కాలంలో పాలిష్ చేయని బియ్యం (దంపుడు బియ్యం) నే ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా ప్రతి ఒక్కరూ అలాంటి బియ్యాన్ని వాడుతున్నారు. కస్టమర్లని దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు ప్రముఖ ధాన్యాలను పాలిష్ లేకుండా మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు.దంపుడు బియ్యం లో అధికంగా ప్రొటీన్లు ,విటమిన్లు ఉండటంవల్ల ఎంతో ఆరోగ్య కరంగా ఉపయోగపడతాయి.
 
సేంద్రియ ఆహారం: ప్రస్తుతకాలంలో తొందరగా దిగుబడి రావడానికి ప్రతి ఒక్క పంటకు రసాయనాలు వాడి పండిస్తున్నారు. దీని వల్ల వాటిలోని పోషక విలువలు చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా గాంధీజీ తన ఆహార విషయంలో సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించే పంటలు మాత్రమే తీసుకొనేవారు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం తో పాటు, భూ కాలుష్యం కూడా నివారించవచ్చు.
 
గింజలు: గింజలలో అధిక శాతం నీటిని కలిగి ఉండడం వల్ల మాంసాహారం తినని వారు, గింజల తీసుకోవడం ద్వారా వివిధ రకాల మాంసకృత్తులను గింజలనుండి పొందవచ్చు. గాంధీజీ శాకాహారి కాబట్టి తన ఆహారంలో గింజలను జోడించేవారు.ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో మొలక వచ్చిన గింజలు తినడం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు