Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

Almonds

సిహెచ్

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (22:47 IST)
సీజన్లు మారుతున్న వేళ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐదు సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.  కాలానుగుణ ఫ్లూ, అనారోగ్యాన్ని దూరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
 
బాదం పప్పులు: బాదం పప్పులు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు-వాటిలో విటమిన్ ఇ,  జింక్, ఫోలేట్, ఐరన్ వంటివి ఉంటాయి. రోగనిరోధక పనితీరుకు మెరుగుపరచడంలో ముఖ్యమైన పోషకాలుగా ఇవి ఉపయోగపడతాయి. పౌష్టికాహారం మెరుగ్గా తీసుకోవటం కోసం ప్రతిరోజూ కొద్దిపాటి అల్పాహారం తీసుకోండి లేదా వాటిని మీ ఉదయం అల్పాహారంతో పాటుగా తీసుకోండి.
 
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ముసాంబి, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం-ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా శరీరం యొక్క రక్షణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు విటమిన్ సి తీసుకోవడం పెరుగుతుంది, మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.
 
వెల్లుల్లి: వెల్లుల్లికి ఔషధ వినియోగంగా సుదీర్ఘ చరిత్ర ఉంది, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ఇది  ప్రసిద్ధి చెందింది, దీనిలో సహజ సిద్ద సమ్మేళనం అల్లిసిన్‌ ఉంది. మీ భోజనంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రుచిని జోడించడమే కాకుండా సూక్ష్మజీవులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. రుచి, ఆరోగ్యం కోసం కూరలు, సూప్‌లు, వేపుళ్ళు, సాస్‌లలో ముక్కలు చేసిన వెల్లుల్లిని జోడించండి.
 
ఆకు కూరలు: బచ్చలికూర, మునగ ఆకులు, ఉసిరి ఆకులు, పుదీనా, ఇతర ఆకు కూరలు రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషించే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఎ మరియు సి , ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి.  ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కూరలు, గ్రేవీలు, పప్పులు, సలాడ్‌లకు జోడించడం ద్వారా మీ ఆహారంలో వివిధ రకాల ఆకు కూరలను చేర్చండి, మీ ఆహారానికి  పోషకాలను జోడించడం  మరియు సువాసనను పెంచుతుంది.
 
- షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?