Article Health Disease %e0%b0%ae%e0%b0%b2%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be 109070300060_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేరియా...!

Advertiesment
మలేరియా
మలేరియా జబ్బుబారిన పడినవారు మృత్యుముఖానికి చేరువలో ఉంటారు. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంటోంది.

ప్రోటోజువన్ ప్లాస్మోడియమ్ అనేపేరుకల కీటాణువుల సంతతికి చెందిన ఎనోఫిలీజ్ ఆడదోమ కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ కీటాణువు జబ్బునుఒక వ్యక్తినుంచి మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది.

లక్షణాలు : మలేరియా వ్యాధికి ప్రముఖమైన లక్షణాలు ఇలా ఉంటాయి. ప్రతి రోజు రోగికి ఒకే సమయంలో జ్వరం రావడం, తలనొప్పి రావడం, చలిపుట్టుకురావడంలాంటి లక్షణాలు. రోగికి చేతులు, కాళ్ళల్లో నొప్పులు రావడం ప్రారంభమవుతుంది.

జాగ్రత్తలు మరియు వైద్యం : మలేరియాబారిన పడకుండా ఉండటమే తొలి ఉపాయం. ముఖ్యంగా ఇంట్లో దోమలను చేరనీయకూడదు. దీనికి మీ పడకగదిలో దోమతెరను ఉంచుకోండి.

ఇంటి చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను, నిల్వ ఉన్న నీటిని తొలగించండి. వీలైతే స్థానిక మునిసిపల్ అధికారులకు సమాచారమిచ్చి మీ పరిసరప్రాంతాల్లో దోమలు చేరకుండా ఉండేందుకు మందులను చల్లేలా చర్యలు తీసుకోండి. గంబూషియా చేప పిల్లలను మురికి గుంటల్లో పెంచేలా చర్యలు తీసుకోండి. దీంతో నిల్వ ఉన్న నీటిలో పెరిగే దోమ గుడ్లను అవి ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఆ చేపపిల్లలను పెంచేందుకు చర్యలు తీసుకోండి.

ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఈ వ్యాధి బారిన పడితే చాలా జాగ్రత్తగా వారికి వైద్య సహాయం అందించాలంటున్నారు వైద్యులు.

మలేరియా వ్యాధిబారిన పడినవారిని ప్రశాంతమైన, వెచ్చటి వాతావరణం కలిగిన ప్రాంతంలో విశ్రాంతినివ్వాలి. దోమ కుట్టిన 14 రోజుల తర్వాతగాని ఈ వ్యాధి బయట పడదంటున్నారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu