చాలామంది తమ ఇళ్లలోని పూజ గదుల్లో తరచు అగరబత్తులు వెలిగించి దేవుని ముందు పెడుతారు. ఐతే అవి నాణ్యమైనవి కాకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ పొగ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాము. కర్బన రేణువులతో కూడిన పదార్థాన్ని ధూపకర్రలను సుగంధం చేయడానికి ఉపయోగిస్తారు.
అగరుబత్తీలు కాల్చినప్పుడు కార్బన్ డైయాక్సైడ్ పొగ రూపంలో విడుదలవుతుంది. ఈ పొగ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. పరిశోధన ప్రకారం, దాని పొగ శరీర కణాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అగరబత్తి పొగ ఊపిరితిత్తులకు హానికరంగా మారే ప్రమాదం వుందని అంటున్నారు.
దీని పొగను ఎక్కువ సేపు పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు బారిన పడే అవకాశం ఉంది. ఇంట్లో అధిక లేదా బలమైన సువాసనతో అగరబత్తిని ఉపయోగించడం మానుకోవాలని సూచన చేస్తున్నారు. సహజ గంధపు అగరుబత్తీలు లేదా ఆవు పేడతో చేసిన ధూపాన్ని ఉపయోగించాలి.