మైగ్రేన్ తలనొప్పి వల్ల వికారం, వాంతులు వల్ల కానీ, లేదంటే కాంతి, ధ్వనికి సున్నితత్వం వంటి వాటివల్ల సంభవించవచ్చు. చాలా మందిలో, తలపై ఒక వైపు మాత్రమే నొప్పి బాధపెడుతుంది. ఈ మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడానికి ద్రాక్ష రసం లేదా కొబ్బరి నీరు త్రాగాలి.
నిమ్మరసంలో అల్లం మిక్స్ చేసి తాగినా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదుటిపై రాసి, అర్థగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఫలితం వుంటుంది.
ఈ సమస్య వున్నవారు బలమైన కాంతికి తగలకుండా చూసుకోవాలి.
మైగ్రేన్ వచ్చినప్పుడు మాడు పైన మసాజ్ చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
పాలలో బెల్లం కలిపి త్రాగినా ఫలితం వుంటుంది.
రెగ్యులర్ యోగా చేసినా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవాలి.