Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ, వేసిన తలుపుల్ని మళ్లీమళ్లీ చెక్ చూస్తూ.. డౌటే లేదు.. ఇది అదే..

కుటుంబంలో ఎవరో ఒకరి ప్రవర్తనలో ఉన్నట్లుండి మార్పు వస్తుంది. చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. చూసేవారికి ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఏమైంది వీళ్లకు అని భయం కూడా వేస్తూ ఉంటుంది. తలుపులకు తాళం వేస్తారు. వేశామా లేదా అని ఒకటికి రెండుసార్లు లాగి లాగి చూస్

Advertiesment
hunting
హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (08:51 IST)
కుటుంబంలో ఎవరో ఒకరి ప్రవర్తనలో ఉన్నట్లుండి మార్పు వస్తుంది. చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. చూసేవారికి ఇది చాలా చిత్రంగా ఉంటుంది.  ఏమైంది వీళ్లకు అని భయం కూడా వేస్తూ ఉంటుంది. తలుపులకు తాళం వేస్తారు. వేశామా లేదా అని ఒకటికి రెండుసార్లు  లాగి లాగి చూస్తారు. గ్యాస్ స్టౌ అపామా లేదా అని అనుమానంతో మళ్లీ చెక్ చేస్తుంటారు. చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ ఉంటారు. ఇదేదో మతిపోయి చేసే చర్యలు కావు. అలాగని ఉన్మాదం అసలే కాదు. ఒత్తిడి వల్ల వచ్చే మానసిక రుగ్మత అనీ చికిత్స తీసుకుంటే సకాలంలోనే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు
 
ఈ వ్యాధి పేరు అబ్బెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ). ఇది ఒక మానసిక రుగ్మత. అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి వల్ల ఇది వస్తుంది. కొంతమందిలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా ఈ వ్యాధి వస్తుంది. ఓసీడీ వ్యాధి ఉన్నవాళ్లు మాటిమాటికీ వాళ్ల వస్తువులను చెక్‌ చేసుకోవడం, వాళ్లు చేసే పనిమీద అనుమానంతో పరీక్షించుకుంటూ ఉండటం, గ్యాస్‌ స్టౌ ఆపేశారా లేదా అని చూడటం, తాళాలు వేశామా లేదా అని పదే పదే చెక్‌ చేయడం వంటివి అన్నమాట. చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ ఉంటారు. దాంతో మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోతూ ఉంటారు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అదే రిపీటవుతూ వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది.
 
జన్యుకారణాలు, పర్యావరణ పరిస్థితులు, మానసిక ఒత్తిడి, ఇన్ఫెక్షన్స్‌, అధికంగా ఆలోచించడం. వంటి పలు కారణాలు ఇలాంటి స్థితిని కలిగించవచ్చు. పదే పదే లాక్‌ చెక్‌ చేయడం,  అంకెలను మళ్లీ మళ్లీ లెక్కించడం దీని ప్రాథమిక లక్షణాలు. ఓసీడీని హోమియో పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో మూల కారణాన్ని గుర్తించి, దానికి చికిత్స చేయడం వల్ల  ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యాధిని నయం చేయవచ్చు.
 
ఓసీడీకి హోమియోలో ఆర్సినికమ్‌ ఆల్బమ్, అర్జెంటమ్‌ నైట్రికమ్, నక్స్‌వామికా, మెరిడోనమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో తగిన మోతాదులో వాడితే తప్పక మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బులెక్కువైనా, తక్కువైనా వచ్చేది మాత్రం అదేనట..