Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

Advertiesment
Heart attack

సిహెచ్

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (14:46 IST)
winter heart attack శీతాకాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువగా వస్తాయి అని చెబుతున్నారు వైద్యులు. ఐతే ఈ సమస్యలు రావడానికి కొన్ని ప్రధాన కారణాలు వున్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
చల్లటి వాతావరణంలో రక్తనాళాలు సంకోచిస్తాయి, ఫలితంగా గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
రక్తనాళాల సంకోచం వల్ల రక్తపోటు పెరిగి ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
చల్లటి వాతావరణంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ, ఈ రక్తం గడ్డలు రక్తనాళాలను అడ్డుకోవడం వల్ల గుండెపోటుకు దారితీస్తుంది.
చలికాలంలో కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇది రక్తనాళాలలో పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది.
చలికాలంలో వాతావరణ మార్పులు, పండుగలు, ఇతర కారణాల వల్ల ఒత్తిడి పెరిగి గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
గతంలో గుండెపోటు వచ్చినవారు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా వుండాలి.
ధూమపానం చేసేవారు, మధుమేహం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు కూడా చలికాలంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆరోగ్యకరమైన ఆహారాలైన తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
రోజూ కొంతసేపు వ్యాయామం, ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, యోగా వంటివి చేయండి.
చలి నుండి రక్షించుకునేందుకు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తగిన దుస్తులు ధరించండి.
 
గమనిక: చలికాలంలో గుండెపోటు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స