ఆస్తమా ఎందుకు వస్తుంది...?
ఇళ్లు దుమ్ము దులపడం, పడని పదార్థాలు తినడం, పడని గాలిని పీల్చడం, శీతల ప్రాంతంలో తిరగడం వంటివాటి ద్వారా ఎలర్జీ వచ్చి ఆయాసం వస్తుంది. ఒక్కొక్కప్పుడు మానసికంగా ఉధ్రేకపడితే కూడా ఆయాసం రావచ్చు. చిన్నపిల్లల్లో కనబడే పాలుపడక, ఆ తర్వాత వచ్చే వ్యాధులకి సరిగ్గా
ఇళ్లు దుమ్ము దులపడం, పడని పదార్థాలు తినడం, పడని గాలిని పీల్చడం, శీతల ప్రాంతంలో తిరగడం వంటివాటి ద్వారా ఎలర్జీ వచ్చి ఆయాసం వస్తుంది. ఒక్కొక్కప్పుడు మానసికంగా ఉధ్రేకపడితే కూడా ఆయాసం రావచ్చు. చిన్నపిల్లల్లో కనబడే పాలుపడక, ఆ తర్వాత వచ్చే వ్యాధులకి సరిగ్గా చికిత్స చేయించకపోవడం వల్ల కూడా ఈ ఆస్త్మా వస్తుంది.
ఆయాసం వస్తే అది ఆస్త్మాయే కాకపోవచ్చు. నడిచినా, కొంచెం శ్రమపడ్డా ఆయాసం వచ్చి కాస్త విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గుతుంటే అది మీ గుండె బలహీనతను సూచిస్తుంది. ముఖం కొంచె ఉబ్బి, నిగారింపుతో ఉండి నడుస్తుంటే ఆయాసమనిపించి అన్నం తిన్నాక మరీ అనిపిస్తే, అది రక్త క్షీణతను సూచిస్తుంది. బలహీనమైనప్పుడు ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఆయాసమనిపిస్తుంది.