Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల బద్ధలయ్యే తలనొప్పి... ఎన్నిరకాలు...?

తలనొప్పులు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు ఎక్కువ సమయం నిద్రపోతే లేదా తక్కువ సమయం నిద్రపోతే, నిద్ర సరిగా పట్టకపోతే కూడా తలనొప్పి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు నిద్రనుండి మధ్యమధ్యలో మేల్కొంటుంటే కూడా తలనొప్పి వస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విపరీ

Advertiesment
Types of Headaches
, గురువారం, 23 జూన్ 2016 (19:12 IST)
తలనొప్పులు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు ఎక్కువ సమయం నిద్రపోతే లేదా తక్కువ సమయం నిద్రపోతే, నిద్ర సరిగా పట్టకపోతే కూడా తలనొప్పి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు నిద్రనుండి మధ్యమధ్యలో మేల్కొంటుంటే కూడా తలనొప్పి వస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విపరీంతగా వ్యాయామం చేస్తే కూడా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి గ్లూకోజ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మెదడుకు గ్లూకోజ్ సరిగా అందదు. దీంతో తలనొప్పి తీవ్రంగా వస్తుందంటున్నారు వైద్యులు.
 
దంతాలలో తీవ్రమైన నొప్పి ఉండటంతో తలనొప్పి వస్తుంది. దంతాల్లో క్రిములుండటం, జ్ఞానదంతం రావడం, తదితరాల కారణంగా తలనొప్పి రావడం జరుగుతుంటుంది.  మానసికపరమైన ఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. దీంతో పాటు నిద్రలేమి, అలసట తదితరాల కారణంగా తలనొప్పి రావడం జరుగుతుంటుంది. కళ్ళజోళ్లు మార్చకపోయినా తలనొప్పి వస్తుంటుంది. విపరీతంగా తలనొప్పి వస్తుంటే కంటి నిపుణుల వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. 
 
అప్పుడప్పుడు కొన్ని మందులు, మాత్రల ప్రభావంతోనూ తలనొప్పి వస్తుంటుంది. ఉదాహరణకు గుండె  జబ్బులకు సంబంధించి వాడే మాత్రలు, మందులు...రక్తపోటును అదుపులో ఉంచేందుకు వాడే మాత్రల ప్రభావంతో తలనొప్పి వస్తుంది. 
 
మైగ్రేన్ తలనొప్పి... తలలోని ఓ వైపు మాత్రమే ఈ తలనొప్పి వస్తుంటుంది. దీనికంతటికి కారణం తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. అధిక ఒత్తిడి కారణంగా కూడా ఈ నొప్పి వస్తుంటుంది.
 
జలుబు, వాతావరణ పరిస్థితుల మార్పులు, ధూమపానం ఎక్కువగా సేవించడం కారణంగా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి శుభ్రతను పాటిస్తూ... మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోండి. మరీ విపరీతంగా తలనొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాదాలను కూడా కాస్త పట్టించుకోండి.. 14 రోజులకోసారి పెడిక్యూర్ తప్పనిసరి