Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్కువసేపు కుర్చీకే పరిమితమై పనిచేసే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి...?

ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధాన కారణాలని

ఎక్కువసేపు కుర్చీకే పరిమితమై పనిచేసే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి...?
, సోమవారం, 6 జూన్ 2016 (21:42 IST)
ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధాన కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది. 
 
వీటన్నింటితో పాటు రోజువారీ జీవన విధానం కూడా మధుమేహం ముప్పు పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు.
 
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఇలా పచార్లు చేయడం వల్ల... ఉదయంపూట వ్యాయామాలకంటే మంచి ఫలితాలను పొందవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి... మితిమీరిన పనిభారంతో ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ పనిచేసేవారు ఈ అధ్యయనంలో చెప్పినట్లుగా వీలు చిక్కినప్పుడల్లా లేచి అటూ ఇటూ తిరగడం వల్ల మధుమేహం బారినుంచి తప్పించుకున్నవారవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎ.టి.ఎ ఆధ్వర్యంలో జూలై 8,9,10న డెట్రాయిట్‌లో అంతర్జాతీయ తెలంగాణ మహాసభలు...