Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రొమ్ము"ల పరిమాణంలో తేడాలు ఉన్నాయా!

Advertiesment
మహిళలు
సాధారణంగా అనేక మంది మహిళల్లో రొమ్ముల (వక్షోజాలు)తో పాటు.. చనుమొనల (నిప్పల్) పరిమాణంలో మార్పులు కనిపిస్తుంటాయి. విద్యావంతులైన వివాహితులు, మహిళలు అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సమస్యకు గల కారణాలు తెలుసుకుంటారు. అదే అవివాహిత మహిళలు, యువతులు దీనిపై పెద్దగా శ్రద్ధ చూపించరు. 

కాలక్రమంలో ఇలాంటి గడ్డలే రొమ్ము క్యాన్సర్‌గా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని స్త్రీలను అధికంగా కలవరపెడుతున్న వ్యాధి క్యాన్సర్. రొమ్ము, గర్భాశయం క్యాన్సర్‌లతో అనేక మంది మహిళలు బాధపడుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహా, నగరాలు, గ్రామీణ మహిళలు కూడా వీటిబారిన పడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఉన్న మహిళల్లో ప్రతి 20 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ రొమ్ము క్యాన్సర్‌ను ఆరంభంలోనే గుర్తిస్తే నివారణ కూడా సాధ్యమేనని వైద్యులు అంటున్నారు. ఇందుకోసం కొన్ని సలహాలు, సూచనలను వారు చేస్తున్నారు.

* ప్రతి మహిళ తమ రొమ్ములను తమంతట తాము నెలకోసారి పరీక్షించుకోవాలి. అరచేతితో రొమ్ముమీద గుడ్రంగా రుద్దాలి. అలా రుద్దేటపుడు ఏదైనా నొప్పిలేని గడ్డ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.

* తమ వంశంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టయితే.. ఇలాటి మహిళలు 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి వైద్య పరీక్ష చేసుకుంటే మంచిది.

* రొమ్ములు, నిప్పల్స్‌ పరిమాణంలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, నిప్పల్స్ నుంచి పలుచటి ద్రవం వస్తున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి.

* చిన్న వయస్సులోనే (12 యేళ్ళ లోపు) రజస్వల అయిన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయి. వీటితో పాటు.. పిల్లలు లేని తల్లులు, తమ పిల్లలకు పాలివ్వని స్త్రీలు, 55 సంవత్సరాల తర్వాత మోనోపాజ్‌కు వచ్చిన మహిళలు, 30 సంవత్సరాల తర్వాత గర్భందాల్చిన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu