Publish Date: Tue, 29 Dec 2015 (13:30 IST)
Updated Date: Tue, 29 Dec 2015 (13:37 IST)
శీతాకాలంలో సాయంత్రం ఒక గ్లాసు వెచ్చటి పాలు, కొన్ని బ్రెడ్ ముక్కలు లేదా బిస్కట్లు తింటే ఎంతో హాయిగా ఉంటుంది. బిస్కట్లంటే ఇష్టపడని వారుండరు. అయితే ఈ బిస్కట్లలో ప్రమాదముంటుందని ఎవరూ గ్రహించలేరు. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు తమ పరిశోధనలో ఇలా వెల్లడించారు.
బ్రెడ్, బిస్కెట్లపై బ్యాక్టీరియా ఆరు నెలల వరకూ ఉండిపోతాయని తెలిపారు. బిస్కెట్లపై ఈ బ్యాక్టీరియా నిలువ ఉంటుందని తాము ఊహించలేదని పరిశోధకులు తెలిపారు. ఈ బిస్కట్లు తినడం ద్వారా బ్యాక్టీరియా శరీరంలో చొచ్చుకుని వివిధ రకాల వ్యాధులకు కారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దుకాణాలలో, తూకం వేసే మిషన్లపై నుంచి బ్యాక్టీరియా బిస్కట్లపైకి చేరుతుందని కూడా వారు వెల్లడించారు. కాబట్టి పిల్లలు అడుగుతున్నారు కదా అని బిస్కట్లు, బ్రెడ్ కొనిస్తే వారి అనారోగ్యానికి కూడా కారణమవుతారని గ్రహించండి.