Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలర్జీ ఆస్తమా రావడానికి కారణాలు ఏంటి? నిరోధించేది ఎలా?

Advertiesment
Allergic asthma symptoms and treatment
, మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (22:21 IST)
అలెర్జీ ఆస్తమా అనేది అత్యంత సాధారణమైన రకం. ఉబ్బసం ఉన్నవారిలో సుమారు అరవై శాతం మందికి ఇది ప్రభావితం చేస్తుందని చెపుతారు. వాతావరణంలోని కొన్ని అలెర్జీ కారకాలు అలెర్జీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కొన్ని సాధారణ అలెర్జీ కారకాలు ఏమిటో చూద్దాం.

 
పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రుతో పాటు పాలు, గుడ్లు, కొన్ని గింజలు వంటి ఆహారాలు. దుమ్ము, పురుగులు, బొద్దింకలు, బొద్దింక మలం. పొగ, ఆటోమొబైల్ మరియు రసాయన పొగలు వంటివి. పెర్ఫ్యూమ్‌ల వంటి అధిక సువాసన కలిగిన ఉత్పత్తుల వల్ల అలెర్జీ ఆస్తమా రావచ్చు.
 
 
అలెర్జీ ఉబ్బసం ఉన్నవారు నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స పొందడం చాలా ముఖ్యం. వైద్యులు నిర్దేశించినట్లుగా మందులను కూడా తీసుకోవాలి.
 
అలెర్జీ ఆస్తమా నుంచి తప్పించుకునేందుకు...
పెంపుడు జంతువుల చుండ్రు, దుమ్ము, పురుగులు మరియు బొద్దింక అలెర్జీ కారకాలను తొలగించడానికి క్రమం తప్పకుండా వాక్యూమ్- డస్ట్ క్లీనింగ్ చేయాలి.
 
పెంపుడు జంతువులను పడకగదుల నుండి దూరంగా ఉంచాలి.
 
పుప్పొడి-  వాయు కాలుష్యం స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి దూరంగా వుండాలి.
 
హాజెల్‌నట్‌లు, వాల్‌నట్‌లు, బాదంపప్పులతో సహా పాలు, గుడ్లు, షెల్ఫిష్, వేరుశెనగలు, చెట్ల గింజలు వంటి అలెర్జీ చర్యలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా వుండాలి.
 
ఇంట్లో కఠినమైన రసాయనాలు, అధిక సువాసన కలిగిన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలసందలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?