Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలీఫ్లవర్ ఆకులు... ఆరోగ్యప్రదాయిని

Advertiesment
కాలీఫ్లవర్ ఆకులు... ఆరోగ్యప్రదాయిని
కాలీఫ్లవర్‌ను గోబీ అని కూడా అంటారు. ఈ ఆకులను పచ్చివిగా సలాడ్ రూపంలో ఆహారంగా తీసుకుంటారు. రోగులకు జబ్బుపడ్డ తర్వాత వైద్యులు గోబీ ఆకులు తినమని చెబుతుంటారు. ఇందులో రక్తాన్ని పెంచే గుణంవుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
కాలీఫ్లవర్‌ను లాటిన్ భాషలో బ్రాసికా ఓలేరేసియా వార్ కేపిటేటా అని అంటారు.
ఈ ఆకులను తినడం వలన కలిగే లాభాలు :-
దంత సమస్యలు :- కాలీఫ్లవర్ పచ్చి ఆకులు (50 గ్రాములు) నిత్యం తీసుకుంటే దంత సమస్యలనుండి ఉపశమనం కలుగుతుంది.

వెంట్రుకలు రాలటం :- ప్రతిరోజు 50 గ్రాములు పచ్చి ఆకులు తీసుకుంటే రాలిపోయిన వెంట్రుకలు తిరిగి మొలకెత్తడం ప్రారంభిస్తాయి.

గాయాలు :- గోబీ పచ్చి ఆకుల రసం అర గ్లాసు చొప్పున రోజుకు ఐదుసార్లు త్రాగితే గాయాలు నయమౌతాయి. దీని రసాన్ని గాయాలపై పూసి కట్టు కట్టడంతో గాయాలు మానుతాయని వైద్యలు చెబుతున్నారు.

క్యాన్సర్ :- ఉదయం పరకడుపున అరకప్పు గోబీ రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. పెద్ద ప్రేవులు శుభ్రమోతాయని వైద్యులు తెలిపారు.

నిద్రలేమి, మూత్రాశయంలో రాళ్లు:- వీటికంతటికి గోబీ రసం ఎంతో లాభదాయకం. దీనిని నెయ్యితో కలిపి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పేర్కొన్నారు.

కొలైటిస్ :- ఈ జబ్బువల్ల ప్రేగుల్లో వాపు కనపడుతుంది. ఈ జబ్బు ప్రారంభంలో రోగి తనకు ఆకలి మందగించినట్లు భ్రమపడతాడు. అనవసరంగా నిరాశలకు లోనయ్యేవారు ఈ జబ్బుకు గురౌతారని వైద్యులు పేర్కొన్నారు.

దీనికి ఒక గ్లాసు మజ్జిగలో 1/4వ వంతు పాలాకు రసం, ఒకగ్లాసు గోబీ ఆకు రసాన్ని ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే కొద్దిరోజుల్లోనే ఈ జబ్బు నయమౌతుందని పరిశోధకులు తెలిపారు.

కొలైటిస్ బారిన పడిన రోగులు రెండుపూటల ఉపవాసం పాటించాలి. మూడవరోజు ఒక గ్లాసు నీరు, మూడు టీ స్పూన్ల తేనె, అర నిమ్మచెక్క రసం కలిపి తాగాలి. అల్పాహారంలో ఒక కప్పు క్యారెట్టు రసం తీసుకోవాలి.

భోజనంతోబాటు పెరుగు, ఒక కప్పు క్యారెట్టు రసం, 1/4వ వంతు పాలాకు రసం తీసుకోవాలి. రాత్రి పూట భోజనంతోబాటు బొప్పాయి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu