ఒత్తిడిని పెంచే సెల్‌ఫోన్..!!
, గురువారం, 12 ఏప్రియల్ 2012 (12:16 IST)
మీ చేతిలో సెల్ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్ ఉంటే ఎంజాయ్ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ ఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.* సెల్‌ఫోన్ వల్ల కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. చేసేపని సకాలంలో పూర్తిచేయలేకపోయామన్న బాధతో ఒత్తిడికి లోనవుతారు.* ఏ పని చేస్తున్నా ఫోన్ మోగినట్లే ఫీలవుతుంటారు. బస్సులోగాని వేరే ఇతర వాహనాల్లో వెల్తున్నప్పుడు ఫోన్ మోగగానే వచ్చే రింగ్‌టోన్ విని ఎవరైనా టీజ్ చేస్తున్నారేమోనని భయానికి లోనవుతారు.* ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తూ వుంటే, ఫోన్‌ను స్విచాఫ్ చేయలేక, ఆన్‌లో ఉంచలేక ఒత్తిడి ఫీల్ అవుతారు.* ఫోన్‌లోనే ఇంటర్నెట్ రావడం వల్ల చిన్న స్క్రీన్ మీదే ఫేస్ బుక్, చాటింగ్ చేస్తూ 24 గంటలూ అందరితో కనెక్టెడ్‌గా ఉండటానికి ప్రయత్నం చేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది.* అదేపనిగా మోనిటర్ చూస్తుండటం వల్ల కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది.* సెల్‌ఫోన్ వల్ల రహస్య సంభాషణలు జరుగుతున్నందున ఎవరైనా వింటారేమోననే ఒత్తిడికి లోనవుతారు.* అదేపనిగా ఫోన్ మాట్లాడటం వల్ల రేడియేషన్ ప్రభావం శరీరం మీదే కాక మనసు మీద కూడా పడి ఒత్తిడికి దారితీస్తుంది.ఆధునిక టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించాలి. సెల్‌ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. అందుకే దానిని అవసరానికి మాత్రమే వినియోగించుకుంటూ, ఒత్తిడిలేని, ఆనందమయమైన జీవితాన్ని గడపటం మంచిది.