కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందా? అవుననే అంటున్నాయి తాజా వైద్య పరిశోధనలు. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవం వల్ల మెదడులోని ఒక ప్రాంతం దెబ్బతినే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైనది.
కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తిన్న జంతువులకు తినాలన్న కోరికను నియంత్రించే మెదడులోని హైపోథలమస్ అనే ప్రాంతంలో చచ్చుపడిపోయింది. ఆకలి తీరిన తర్వాత తినడం ఆపేయాలన్న ఆ జంతువులో నశించినట్లు వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఇవే లక్షణాలను కొందరు మనుషులపై ప్రయోగించినప్పుడు కూడా కనిపించినట్లు పరిశోదకులు తెలిపారు.
కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తిన్న కొందరికి 24 గంటల్లో మెదడులోని హైపోథలమస్ ప్రాంతం చచ్చుపడిపోయినట్లు వారు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కొవ్వు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలలో వాపు ఏర్పడుతుంది. ఇది అలర్జీలో ఏర్పడే వాపులు వంటివి కావని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని హైపోథలమస్ ప్రాంతంలో వాపులాంటిది ఏర్పడితే తాము ఎంత తింటున్నామో గ్రహించే శక్తిని కోల్పోతారని, కడుపు నిండిన తర్వాత కూడా తినాలన్న కాంక్ష వారిలో పోదని వైద్య పరిశాదకులు తెలిపారు.