Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో ఉపవాసాలు ఉండకూడదు.. మజ్జిగ, సూప్‌లు తాగితే?

Advertiesment
వేసవిలో ఉపవాసాలు ఉండకూడదు.. మజ్జిగ, సూప్‌లు తాగితే?
, బుధవారం, 13 మే 2015 (19:15 IST)
వేసవి వేడికి శరీరంలోని శక్తి ఇట్టే కరిగిపోతుంది. కొత్త శక్తికోసం ద్రవపదార్థాలు, లవణాలు కలిగినవి, సులభంగా జీర్ణం అయ్యేవి తీసుకోవడం అవసరం. అందుకోసం మనం ఎంచుకోవాల్సిన ఆహారంలో బార్లీ జావ, దోస వంటివి ఉండాలి. నిమ్మరసం, మామిడి, జామపండ్లు, పెరుగు, పుదీనా వంటివి వాడాలి. 
 
నీరు బాగా తాగాలి. నీటిలో ఉప్పు, పంచదార కలిపి తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. వేసవిలో పండ్లు, పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పుచ్చకాయలు బాగా తినవచ్చు. వేసవి కాలంలో సూప్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వేసవిలో మజ్జిగ తగినంత తాగడం అవసరం. మజ్జిగవల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభించడమే కాకుండా పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
వేసవిలో ఉపవాసాలు ఉండకూడదు. శరీరానికి తగిన రీతిలో ఆహారం అందివ్వకపోతే.. వేసవిలో శరీరంలోని నీరు నష్టపోయి, సులభంగా బలహీనపడతారు. బలహీన శరీరానికి వడదెబ్బ ఇట్టే తగులుతుంది.

Share this Story:

Follow Webdunia telugu