Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చుట్ట తాగితే... చాప చుట్టేయాల్సిందేనా..?

Advertiesment
reveals Cigars are worse
, మంగళవారం, 5 మే 2015 (20:55 IST)
చుట్ట.. బీడీ.. సిగరెట్ ఏది తాగితే ఆరోగ్యానికి హానికరం అంటే..? అన్నీ హానికరమే వెంటనే మానేయండి అని చెబుతారు మన డాక్టర్లు... మరి ఆరోగ్య పరిశోధనా సంస్థలు ఏం చెబుతున్నాయ్.. ? పళ్లు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముందనే రీతిలో సమాధానం చెబుతూనే, చుట్ట తాగితే చాప చుట్టేయాల్సిందేనని గంట భజాయించి మరీ చెబుతున్నాయి. అత్యంత ప్రమాదకరమని తేల్చి చెబుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ర్టేషన్ విభాగం ధూమపానంపై ఓ పరిశోధన చేసింది. అమెరికాలో 2000 నుంచి 2011 మధ్య కాలంలో పొగాకు చుట్టలకు డిమాండ్ పెరిగి సిగరెట్ల వినియోగం తగ్గిపోవడంతో ఓ సంస్థ దీని ప్రభావం, ఫలితాలపై అధ్యయనం జరిపింది. 2000 సంవత్సరంలో చుట్టల వినియోగం 6.2 బిలియన్స్‌గా నమోదుకాగా, 2011లో అది 13.7 బిలియన్‌కి చేరుకుందని తేల్చింది. అలాగే  సిగరెట్ల అమ్మకాల్లో 33 % తగ్గుదల కనిపించింది. 
 
చుట్ట తాగితే ఎంత నష్టం? సిగరెట్ పీల్చితే ఎంత నష్టం? అనే అంశంపై పరిశోధన చేసింది. దానిలో చాలా అంశాలను పరిశీలించింది. సిగరెట్లు తాగడం కన్నా పొగాకు చుట్టలు తాగడం మరీ ప్రమాదకరం అని ఈ అధ్యయనంలో తేల్చేసింది. అంతేకాకుండా గతంలో సిగరెట్లు తాగే అలవాటుండి, ఆ తర్వాతి కాలంలో చుట్టలు అలవాటు చేసుకున్నట్లు అయితే అది మరింత అనారోగ్యానికి దారితీసే పరిస్థితి వుందని అధ్యయనం స్పష్టం చేసింది.
 
సిగరెట్ తాగే అలవాటున్న వాళ్లు, చుట్టలు తాగితే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారముందని అధ్యయనం హెచ్చరించింది. సో చుట్ట తాగితే కొన్నాళ్ళకే చాప చుట్టేయాల్సిందేనన్నమాట. 
 

Share this Story:

Follow Webdunia telugu