Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పైల్స్ అంటే...? ఎలా వస్తాయి..? వస్తే ఎలా....!

పైల్స్ అంటే...? ఎలా వస్తాయి..? వస్తే ఎలా....!
, సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (15:39 IST)
మలాశయ వ్యాధులలో ముఖ్యమైనది పైల్స్. ఈ వ్యాధిని మొలలు వ్యాధి అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పైల్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి రావడం వంటివి పైల్స్ ఉనికిని తెల్పుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటివల్ల ఉపశమనం కలుగుతుంది. పైల్స్ బాధ భరించడం కష్టమే అయినప్పటికీ, ఇది మరీ తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదని వైద్యులు తెలుపుతున్నారు. ఇక పైల్స్ ఎలా వస్తుంది, తీసుకోవాల్సి జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం.
 
పైల్స్ మలద్వారానికి లోపల భాగంలో అనేక రక్తనాళాలు రక్త సరఫరా చేస్తూ ఉంటాయి. ఈ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువగా ముక్కినప్పుడు సున్నితమైన రక్త నాళాలు ఒత్తిడివల్ల సాగి పిలకలవలే బయటికి వస్తాయి. వీటినే పైల్స్ అంటారు. ఇవి ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ రావచ్చు. ముఖ్యంగా ఒకే చోటు ఎక్కువ సేపు కూర్చునే వారికి, మలవిసర్జన సమయంలో ఎక్కువగా ముక్కేవారికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ.
 
పైల్స్ అందరిలోను ఉంటాయి. సాధారణంగా వీటి వలన ఏమీ బాధ ఉండదు. కాని అక్కడ రక్తనాళాలు వాచి, ఉబ్బినపుడు మల ద్వారం ద్వారా బయటికి వస్తాయి. రాకుండా ఉన్నా కూడా బాధ తప్పదు. అప్పుడు నొప్పి, బాధ, రక్తం కారడం జరుగుతుంది. ధమనులు వాచి వాటిపై ఒత్తిడి కలిగితే ప్రకాశవంతమైన ఎరుపురంగు రక్తం వెలువడుతుంది. అవే సిరలయితే నల్లటి రక్తం వస్తుంది. బాగా దగ్గడం వల్ల కాని, మరే విధంగా ఒత్తిడి అయినా రావచ్చు. పైల్స్ నీలం, ఎరుపు, తెలుపు, ఊదా రంగులలో ఉంటాయి.
 
పైల్స్‌ను నాలుగు దశలుగా విభజించవచ్చు. ప్రారంభ దశలో బయటకి కన్పించవు. రెండవ దశలో మల విసర్జన సమయంలో బయటికి వస్తాయి. వాటంతట అవే లోనికి పోతాయి. మూడవ దశ చేతితో గట్టిగా లోపలికి నెడితేగాని లోపలికి పోవు. చివరి దశ వాటిని లోపలికి నెట్టడం కష్టంగా ఉంటుంది. బయటే ఉండిపోతాయి.
 
ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లైతే సరిగా నిలబడలేరు. కూర్చోలేరు. ఎక్కువగా రక్తం పోతుంటే నీరసం వస్తుంది. విపరీతంగా కాళ్ళు లాగుతాయి. విసుగు, కోపం వస్తాయి. రక్తహీనత కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం కూడా ఉంది. కనుక పైల్స్ వ్యాధి వస్తే  కారపు వస్తువులు, మసాలా, వేపుళ్ళు, ఊరగాయలు, దుంపకూరలు, పచ్చళ్ళు, చింతపండు వంటివి తినరాదు. అయితే పీచు అధికంగా ఉండే కూరగాయలు, ఆక కూరలు తింటూ ఎక్కువగా నీళ్లు తాగడం మంచింది.

Share this Story:

Follow Webdunia telugu