Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 16 March 2025
webdunia

పోషకాహారం తీసుకోకపోతే... అజీర్తి.. రక్తహీనత తప్పదు!

Advertiesment
పోషకాహారం తీసుకోకపోతే... అజీర్తి.. రక్తహీనత తప్పదు!
, సోమవారం, 10 నవంబరు 2014 (15:51 IST)
బిజీ లైఫ్‌స్టైల్‌లో మనం తీసుకునే ఆహారంపై కూడా దృష్టిసారించలేక పోతున్నాం. ముఖ్యంగా.. ఎపుడు తింటున్నామో కూడా పట్టించుకోం. తినే ఆహారం పట్ల అశ్రద్ధగా ఉన్నా... వేళాపాళా లేకుండా ఏది పడితే అది తినడం అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకోసం కొన్ని సూచనలు పాటిస్తే చాలు. మీరు ప్రతి రోజూ ఏదో ఒక పండును తింటున్నారా. అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఇష్టానుసారంగా కాఫీ టీలను తీసుకోరాదు. వేళాపాలా లేకుండా చిరుతిండ్లు తినకూడదు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 
 
వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతి రోజూ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, కారం, నూనె వంటివి మీకు సరిపడా అంటే తక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. నీరసం, అజీర్తి, రక్తహీనత వంటి సమస్యలను ఎపుడూ ఎదుర్కొంటున్నట్టు గ్రహించారా. 
 
ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా పాటించినట్టయితే మీరు పోషకాహారాన్ని తీసుకుంటున్నట్టు నిర్ధారించుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu