Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకుకూరలు, వాల్ నట్స్‌తో మతిమరుపుకు చెక్!

Advertiesment
memory gain food list
, శనివారం, 1 నవంబరు 2014 (17:53 IST)
మతిమరుపుకు విటమన్స్, ప్రోటీన్స్ లోపం కారణం కావొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే తాజాగా, గ్రీన్ ఆకుకూరలు, కూరగాయలతో పాటు బెర్రీ ఫ్రూట్స్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం.. మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్‌లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. తద్వారా మతిమరుపు దూరమవుతుంది. ఇవి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తాయి. 
 
అలాగే బాదం, వాల్ నట్స్‌ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. వాల్ నట్స్, బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. 
 
కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి. ఇవి మెమరీ పవర్‌ను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu