Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యాహ్నం పూట కునుకుతీయండి..ఆరోగ్యంగా ఉండండి!

మధ్యాహ్నం పూట కునుకుతీయండి..ఆరోగ్యంగా ఉండండి!
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (17:31 IST)
మధ్యాహ్నం పూట ఓ గంట పాటు కునుకు తీస్తే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ తర్వాత హాయిగా నిద్ర వస్తుంటే ఎక్కడపడితే అక్కడ కునుకు తీయడం కొందరి అలవాటే. ఆ అలవాటే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
కాసేపు అలా నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. 
 
పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి దరిచేరవని పరిశోధకులు సూచిస్తున్నారు.
 
పగటిపూట అలా కాసేపు కునుకుతీస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సమర్థవంతంగా పనిచేయవచ్చు. కళ్లకు కాసింత విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది. 
 
ఇంకా పగటి పూట కునుకు తీయడం ద్వారా రిలాక్స్‌గా కనిపిస్తారు. గుండె పనితీరు మెరుగవుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులను సమం చేసినట్లవుతుంది. రక్తనాళాలను శుభ్రపరిచేందుకు పగటి పూట నిద్ర పనికొస్తుంది. 
 
మధ్యాహ్నం సమయంలో 20-30 నిమిషాలు నిద్రపోవడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. ఒత్తిడి దూరం కావడమే కాకుండా.. అలసట తీర్చే నిద్రవల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. పగటిపూట కాసేపు కునుకు తీయడం రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించగలుగుతారు. 

Share this Story:

Follow Webdunia telugu