వెల్లుల్లిని చప్పరించడం వల్ల నోరు ఘాటు వాసనతో నిండిపోవచ్చుగాని, వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యవంతంగా ఉండేందుకు వెల్లుల్లి సహకరిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తనాళాలకు విశ్రాంతిని ఇచ్చి రక్త సరఫరాను మెరుగుపరిచి, రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకునే ఎల్లిసిన్‌ను ఉత్పత్తి చేయగల శారీరక సామర్థ్యాన్ని వెల్లుల్లి పెంచగలదని వారు వివరించారు.
ఎర్ర రక్త కణాలతోపాటు ఎల్లిసన్ ప్రతిస్పందించి హైడ్రోజన్ సల్ఫైడ్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఇది రక్త నాళాల విశ్రాంతికి సహకరించి, రక్త సరఫరాను సాఫీగా కొనసాగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వెల్లుల్లి వినియోగం అధికంగాగల మధ్య ప్రాచ్యం, తూర్పు ప్రాచ్య దేశాల్లో గుండె సంబంధిత జబ్బులు తక్కువని సోదాహరణంగా తెలిపారు. ఈజిప్టు దేశస్తులు వెల్లుల్లిని ఆరాధిస్తారు. వెల్లుల్లి నమూనాలను వారి చరిత్రలో నిబిడీకృతమై ఉన్నట్లు ఆధారాలున్నాయి.