ఒక కప్పు టీ సేవించడం వల్ల మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా అలసట తగ్గటం, పనిపై శ్రద్ద పెరగడం తద్వారా పనితీరు మెరగవుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
44 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొన్న ఈ అధ్యయనంలో డచ్ శాస్త్రవేత్తలు టీలో ఉండే కీలక రసాయనాలు మనిషి మానసిక పనితీరుపై ఎలా పనిచేస్తుందో పరిశీలించారని డైలీ మెయిల్ తెలిపింది.
కప్పు టీలో ఉండే అమినో యాసిడ్, కెఫిన్లు మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు 20 నుంచి 70 నిమిషాల తర్వాత ఒక కప్ టీ సేవించేవారు టీ తాగనివారితో పోలిస్తే పనిలో ఖచ్చితత్వం పాటిస్తున్నారని అధ్యయనం తెలిపింది.
టీ తాగేవారికు చేసే పనిపై శ్రద్ధ కూడా ఎక్కువ అని ఆ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న 40 సంవత్సరాలలోపు వ్యక్తులలో టీ సేవించడం ద్వారా అలసట కూడా తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.