"
జార్ఖండ్ డైనమైట్" అంటూ క్రీడాభిమానులందరూ ముద్దుగా పిల్చుకునే మహేంద్రసింగ్ ధోనీ భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. భారత టెస్టు జట్టుకు, ట్వంటీ 20 జట్టుకు కెప్టెన్‌గా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తున్న ధోనీ డిక్షనరీలో అలసట అన్నది లేనేలేదు. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా, వైస్‌కెప్టెన్‌గా.. భారత క్రికెట్‌లో పలు పాత్రలను పోషిస్తున్న ధోనీ జన్మదినం (జూలై 7) సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కథనం మీకోసం...మహేంద్ర సింగ్ ధోనీ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన రాంచీలో 1981, జూలైన 7వ తేదీన జన్మించాడు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చిన ధోనీ తల్లిదండ్రులు రాంచీలో స్థిరపడ్డారు. తండ్రి పేరు పాన్ సింగ్, తల్లిపేరు దేవ్‌కీ దేవి. ధోనీ రాంచీలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నతనంలో బాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆటలను బాగా ఆడుతుండే ధోనీని... అతని ఫుట్‌బాల్ కోచ్ క్రికెట్ ఆడేందుకు ప్రేరేపించాడు.జిమ్‌కెళ్లటం అంటేనే చిరాకు...! |
|
సంగీతం వినడం, గజల్స్ మరియు లతా మంగేష్కర్, కిశోర్ కుమార్ పాటలంటే ఎంతో ఆసక్తి. బైక్ రైడింగ్ అంటే ధోనీకి చాలా ఇష్టం. అలాగే కంప్యూటర్ గేమ్స్ ఆడటం మరియు బాడ్మింటన్ ఆడటం కూడా ఇష్టమే. ఇంగ్లీషు పాటలన్నా, జిమ్‌లకెళ్లి ఎక్సర్‌సైజులు చేయడం అన్నా ఈయనకు చిరాకు... |
|
|
అలా కుడిచేతి వాటంగల బ్యాట్స్‌మెన్‌గా మరియు వికెట్ కీపర్‌గా... క్రికెట్లోకి ప్రవేశించిన ధోనీ 1995లో "కమాండో క్రికెట్ క్లబ్" వికెట్ కీపర్‌గా క్రీడా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత అండర్-16 విభాగంలో 1997-98 మధ్య జరిగిన "వినో మన్కడ్ ట్రోఫీ"లో ఆడేందుకు ఎంపికయ్యాడు.
ఆ తరువాత 1998-99వ సంవత్సరాల మధ్య బీహార్ క్రికెట్ టీమ్‌లోకి ప్రవేశించిన ధోనీ, తదనంతరం ఇండియా-ఎ క్రికెట్ టీమ్‌కు 2004వ సంవత్సరంలో ఎంపికయ్యాడు. అదే సంవత్సరంలోనే అతను టీం ఇండియా జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టిన ధోనీ... పాకిస్థాన్‌తో జరిగిన 5వ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో 148 పరుగులు సాధించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక వికెట్ కీపర్ అంత పెద్ద స్కోరు సాధించటం క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఓ మైలురాయి లాంటిదే..! విశాఖపట్నంలో 2005 ఏఫ్రిల్ 5వ తేదీన జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 123 బంతుల్లోనే ధోనీ 148 పరుగులు సాధించాడు.
అదే సంవత్సరంలో శ్రీలంకపై 183 పరుగులు చేసి నాటౌట్‌గా నిల్చిన ధోనీ, తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. లంక విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం 145 బంతుల్లోనే 183 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించిన ధోనీ.. భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ సిరీస్ మొత్తానికి 346 పరుగుల అత్యధిక స్కోరును సాధించిన ధోనీ "మ్యాన్ ఆఫ్ ది సిరీస్" అందుకున్నాడు.
దేశంలోనే బాగా వెనుకబడిన రాష్ట్రమైన జార్ఖండ్ రాష్ట్రం నుంచి చిన్న వయస్సులో భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన ఆటగానిగా ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. జట్టులోకి ప్రవేశించిన తరువాతి నుంచి నేటిదాకా భారత జట్టుకు ఆయన ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన సంగతి అందరికీ తెలిసిందే...! భారత జట్టుకు విజయవంతమైన నాయకుడిగా రాణిస్తున్న ధోనీ హాబీలేంటంటే...
సంగీతం వినడం, గజల్స్ మరియు లతా మంగేష్కర్, కిశోర్ కుమార్ పాటలంటే ఎంతో ఆసక్తి. బైక్ రైడింగ్ అంటే ధోనీకి చాలా ఇష్టం. అలాగే కంప్యూటర్ గేమ్స్ ఆడటం మరియు బాడ్మింటన్ ఆడటం కూడా ఇష్టమే. ఇంగ్లీషు పాటలన్నా, జిమ్‌లకెళ్లి ఎక్సర్‌సైజులు చేయడం అన్నా ఈయనకు భలే చిరాకు. పాజిటివ్‌గా ఉండటం, తనపైన, తన రంగంపై పూర్తి నమ్మకం కలిగి ఉండటం ధోనీ ప్రత్యేక లక్షణాలు. ఇక ఈయనకు క్రికెట్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆదర్శం.