రాష్ట్రంలో ఉండే అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టు అంటారు. మన దేశంలో ఉండే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేలాగా చట్టాన్ని తీసుకొచ్చే అధికారం మన పార్లమెంటుకు కలదు.
ప్రస్తుతం మన దేశంలో 21 హైకోర్టులు ఉన్నాయి. ఒక్కో హైకోర్టుకు ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈ న్యాయమూర్తిని మన రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టుకు న్యాయమూర్తి కావాలంటే... భారతదేశ పౌరుడై ఉండి, కనీసం 10 సంవత్సరాలపాటు దిగువ కోర్టుల్లో న్యాయమూర్తిగా లేదా హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా, న్యాయశాస్త్రవేత్తగా పనిచేసి ఉండాలి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి, రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసులపైనైనా కూడా న్యాయ విచారణ కోసం హైకోర్టును సంప్రదించవచ్చు.