వైరస్‌లు ఎంత చిన్నగా ఉంటాయో అర్థం చేసుకోవాలంటే ముందుగా బ్యాక్టీరియాలు ఏ సైజులో ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. బ్యాక్టీరియాలు రకరకాల సైజుల్లో ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా పెద్ద సైజులో ఉండే బ్యాక్టీరియాలు మన ఎర్రరక్త కణంలో పదోవంతు కన్నా చిన్నగా (0.08 మి.మీ.లు) ఉంటాయి. ఇక అన్నిటికన్నా చిన్న సైజులో ఉండే బ్యాక్టీరియాలు ఎర్రరక్త కణంలో 14,000వ వంతు మాత్రమే ఉంటాయి. వైరస్‌లు ఈ బ్యాక్టీరియాల కన్నా చాలా చిన్నగా ఉంటాయి.
ఉదాహరణకి ప్లూకి కారణమయ్యే వైరస్ అతి చిన్న బ్యాక్టీరియా కన్నా 6రెట్లు చిన్నగా ఉంటుంది. ఇక బంగాళాదుంపల్లో 'స్ప్లిండర్ ట్యూబర్' అనే వ్యాధికి కారణమయ్యే వైరస్ అతి చిన్న బ్యాక్టీరియా కన్నా 2500 వ వంతు చిన్నగా ఉంటుంది. చాలా చిన్న సైజులో ఉండే బ్యాక్టీరియాలు సైతం అనేక వైరస్‌ల ముందు భూతాల్లో ఉంటాయి. దీనిని బట్టి వైరస్‌లు ఎంత సూక్ష్మంగా ఉంటాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వైరస్‌లలో అన్నిటికన్నా చిన్నది మన ఎర్ర రక్తకణంలో (1మి.మీ.లో) 3,50,00,000వ వంతు ఉంటుంది.