మోటార్ సైకిల్‌ను ఎవరు కనుగొన్నారు?
, సోమవారం, 7 నవంబరు 2011 (13:32 IST)
ఓ నూటపాతికేళ్ల క్రితం మోటార్‌సైకిళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొంతమంది అప్పటికే ప్రయోగాలు చేసి వాటిని తయారుచేసె ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే వాటికీ... ప్రస్తుత కాలంలోని మోటార్ బైక్‌లకీ... ఏ మాత్రం పోలికలు ఉండవు. 1885లో జర్మనీకి చెందిన గాటిలెబ్ డైమ్‌లర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో నడిచే మోటార్ సైకిల్‌ని రూపొందించాడు. అంతకన్నా ముందే 1869లో మైకక్స్ పియరక్స్ అనే ఫ్రాన్స్ కంపెనీ వారు సైకిల్‌కి ఆవిరితో నడిచే ఇంజన్‌ను బిగించి మోటార్ సైకిల్‌లా నడిపారు. కానీ డైమ్‌లర్ తయారుచేసినదే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దాని అత్యధిక వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఆధునిక బైక్‌లలో కొన్ని గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుస్తున్నాయి.