"మైసూరు రాకెట్" దాని కథా, కమామీషు..!
చిన్నా, పెద్దా తేడా లేకుండా.. అందరి ఉత్సాహానికి ఊపిరిపోస్తూ... అందరినీ మురిపించే వెలుగుల పండుగ "దీపావళి". సాధారణంగా దీపావళి అనగానే పిల్లలందరికీ టపాకాయలు గుర్తుకు వస్తాయి. వారం రోజుల ముందునుంచి సందడి సందడిగా సాగే ఈ పండుగ టపాసుల శబ్దంతో మార్మోగుతుంటుంది. ఈ టపాకాయల్లో నిప్పు రవ్వలు జుయ్‌మంటూ ఆకాశంలో దూసుకుపోయే రాకెట్ అంటే అందరికీ చాలా ఇష్టం.టపాకాయల్లో ఈ రాకెట్ గురించి కాసేపలా పక్కనబెడితే.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ "ఇస్రో", అలాగే అమెరికాలోని గల "నాసా"లు రాకెట్ల సాయంతో శాటిలెట్లను అంతరిక్షంలోకి పంపుతుంటారని మీకు తెలిసే ఉంటుంది. పుస్తకాలలో కూడా ఈ విషయాలు చదువుకుని ఉండి ఉంటారు.అయితే ఈ రాకెట్లను శతాబ్దాల క్రితం ఆయుధాలుగా కూడా ఉపయోగించేవారట పిల్లలూ.. ఇలాంటి రాకెట్లను ప్రయోగించటంలో మనం దేశం అన్నింటింకంటే ముందుండేదట. ఈ రాకెట్లను మైసూరు టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దం చివరిలో తయారు చేశాడట. మైసూరు సైన్యంలో 5 వేల మంది సైనికులతో ఈ "రాకెట్ విభాగం" ఉండేదట.టిప్పు మరణంతో కథ బయటికి..!
బ్రతికి ఉన్నంతవరకూ భారత్‌లో బ్రిటీష్ సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన టిప్పు సుల్తాన్ 1799లో కర్నాటకలోని తురకనహళ్లిలో జరిగిన భీకర యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన మరణం తర్వాతే తను రూపొందించి అభివృద్ధి చేసిన... చరిత్రలో మొట్టమొదటిది అయిన ఈ రాకెట్ కథ బయటి
బ్రతికి ఉన్నంతవరకూ భారత్‌లో బ్రిటీష్ సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన టిప్పు సుల్తాన్ 1799లో కర్నాటకలోని తురకనహళ్లిలో జరిగిన భీకర యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన మరణం తర్వాతే తను రూపొందించి అభివృద్ధి చేసిన... చరిత్రలో మొట్టమొదటిది అయిన రాకెట్ కథ బయటి ప్రపంచానికి తెలిసింది.టిప్పుసుల్తాన్ రాజ్యంలోని రాకెట్ విభాగం... రాకెట్ల పరిమాణం, ఎగరాల్సిన ఎత్తు, వెళ్ళాల్సిన దూరం, చేధించాల్సిన గమ్యం మొదలైన అంశాలను ఆధారంగా చేసుకుని వాటిని అమర్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని సైనికులకు అందజేసేవారట. ఇక మన మైసూర్ రాకెట్ సగటున 2.4 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగేదని చెబుతుంటారు.అత్యంత ప్రాథమిక పరిజ్ఞానంతో టిప్పుసుల్తాన్ రూపొందించిన తొలితరం యుద్ధ రాకెట్ కేవలం రెండు కిలోల బరువు ఉండేదట. 5 సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్‌లో కిలో గన్ పౌడర్ దట్టించి దానినే ఇంధనంగా మండిస్తూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువులను సైతం గడగడలాడించేవారట. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో రాకెట్ లాంచ్‌ప్యాడ్‌లు సైతం ఉండేవని చరిత్రకారుల భావన. ఇదే కాలంలో ఇంగ్లండ్ దేశం తయారు చేసి ప్రయోగించే రాకెట్లు కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ప్రయాణించేవట. అందుకే తెలివైన బ్రిటీష్‌వారు మైసూరు యుద్ధాలలో తమపై ప్రయోగించబడిన రాకెట్లను సేకరించి, వాటిని పరిశోధించేందుకు వీలుగా ఇంగ్లండుకు తరలించేవారట. అలా మన రాకెట్ల శక్తిని, పనితీరును పరిశోధించి తెలుసుకున్న బ్రిటీష్‌వాళ్లు.. వారి రాకెట్లను మరింత శక్తివంతంగా ఆధునీకరించి ఉపయోగించారని చెబుతుంటారు.టపాకాయల రాకెట్ గురించి చెప్పుకోవటం మొదలెడితే.. టిప్పు సుల్తాన్ కనుగొన్నవి.. మనదేశపు మొట్టమొదటివి అయిన రాకెట్ల గురించిన గమ్మత్తయిన విషయాలను తెలుసుకోవటం భలే ఆసక్తికరంగా ఉంది కదూ పిల్లలూ..!!