ప్ర. షేక్స్‌స్పియర్ జన్మస్థలం ఏది?
జ. మధ్య ఇంగ్లండులోని "స్టార్ట్‌ఫోర్డ్ ఆన్ ఆవోన్" ప్రాంతంలో విశ్వ విఖ్యాత రచయిత షేక్స్‌స్పియర్ జన్మించాడు. స్టార్ట్‌ఫోర్డ్ ఆన్ ఆవోన్ ప్రాంతం "ఆవోన్ నది" పక్కనే ఉంటుంది.
ప్ర. "ఈవెనింగ్ స్టార్"గా పిలువబడే గ్రహం ఏది?
జ. వీనస్
ప్ర. "బ్రెయిన్ డెత్" అంటే ఏంటి?
జ. మెదడుకు కలిగిన గాయం కారణంగా మెదడు తనంతటతానే, స్వతంత్రంగా పనిచేసే సదుపాయాన్ని కోల్పోవడాన్ని "బ్రెయిన్ డెత్" అంటారు.
ప్ర. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఏది?
జ. గిన్నిస్ బుక్ 1999వ సంవత్సరపు రికార్డుల ప్రకారం... కంబోడియాలో 402 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన "అంగ్‌కోర్ వాట్" ('దేవాలయాల నగరం') ఇప్పటిదాకా నిర్మించబడ్డ అతిపెద్దదైన దేవాలయంగా గుర్తింపు పొందింది. దీన్ని క్రీస్తు శకం 900 సంవత్సరంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ దేవాలయ సముదాయంలో 72 ప్రధానమైన స్మారక నిర్మాణాలు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
ప్ర. "ఉదయించే సూర్యుడి ప్రాంతం"గా పిలువబడే దేశం ఏది?
జ. జపాన్.