ఏంటని ఆలోచిస్తున్నారా...! అదేంటంటే, రోదసీలోకి మొట్టమొదట ప్రయాణించిన జంతువు "లైకా" అనే శునకం (కుక్క). ఇది 1957వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన రష్యాకు చెందిన అంతరిక్ష నౌక స్ఫుత్నిక్-2లో అంతరిక్షంలోకి వెళ్ళింది.
అంతరిక్ష నౌకలోని సమశీతోష్ణ గదిలో లైకాకు సరిపడేంత ఆహారాన్ని ఏర్పాటు చేశారు శాస్త్రజ్ఞులు. రోదసీలో నౌక పరిభ్రమిస్తున్నప్పుడు అందులో ఏర్పాటు చేసిన సామగ్రి, లైకా ప్రవర్తనను భూమిమీది శాస్త్రజ్ఞులకు చేరవేసింది.
అయితే ఆ రోజుల్లో రోదసీలో ప్రవేశపెట్టిన నౌకను మళ్లీ భూమిమీదకు తెచ్చే పరిజ్ఞానం రూపొందని కారణంగా లైకా నౌకలోనే మరణించింది. కానీ... తన ప్రాణాలను త్యాగం చేసిన లైకా మరణం మానవుల రోదసీ ప్రయాణానికి మార్గం సుగమం చేసింది.