మందులు రంగు సీసాల్లో ఇస్తారెందుకు?
మనం కొనే టానిక్‌లు, సిరప్‌ల వంటివన్నీ గోధుమరంగు సీసాల్లోనే ఇస్తారు. కొన్ని రకాల మాత్రలను రంగు సీసాల్లోనే ఉంచుతారు. అంతేకాక మందు సీసాలను చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాలలో ఉంచమని సూచిస్తారు. దీనికి కారణం మందులను రసాయనాలతో చేస్తారు.ఆ రసాయనాలు సూర్యకాంతిలోని వేడి, అతినీలలోహిత తరంగాల ప్రభావాన మార్పు చెంది, వాటిలోని ఔషధ గుణాన్ని పూర్తిగా కోల్పోతాయి. అందువల్ల గోధుమరంగు సీసాల్లో ఇస్తారు. ఆ రంగు కాంతి సీసాలోనికి అంతగా వెళ్ళదు. మందులు తమ శక్తిని కోల్పోయే వీలుండదు.