పిల్లలూ... ఇప్పటిదాకా మనందరం ప్రపంచంలోని ఏడు వింతల గురించే విన్నాం కదూ..! ఆ మధ్య మన తాజ్‌మహల్‌కు ప్రపంచ వింతల్లో స్థానం సంపాందించటంతో చాలా సంతోషపడ్డాం. అయితే, తాజాగా ఎన్డీటీవీ భారతదేశంలోని ఏడు వింతల జాబితాలను విడుదల చేసింది.
కోణార్క్ సూర్య దేవాలయం, జైసల్మేర్ కోట, మధుర మీనాక్షి ఆలయం, ఖజురహో, ఎర్రకోట, నలంద యూనివర్సిటీ, దోలవిరా (గుజరాత్) ప్రాంతాలనే "భారత్‌లోని ఏడు వింతలు"గా ఎన్డీటీవీ ప్రకటించింది. ఇందుకుగానూ... మొత్తం 220 కట్టడాలు, ప్రాంతాలు పోటీపడగా, వాటిలో పై ఏడింటిని ఎంపికచేసినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది.
తమకు నచ్చిన కట్టడానికి ప్రజలందరూ ఓటు వేయాలని పత్రికలు, టెలివిజన్లు, రేడియా, ఇంటర్నెట్ ద్వారా ప్రచారం నిర్వహించిన ఎన్డీటీవీ... ఎంపిక ప్రక్రియను 12 మందితో కూడిన జ్యూరీ పర్యవేక్షించినట్లు తెలిపింది. కాగా, సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీటీవీ పై ఏడు వింతల జాబితాను విడుదల చేసింది. ప్రపంచం మొత్తంమీదా ఏడువింతలయితే.. మనదేశంలో మాత్రమే ఏడు వింతలుండటం భలేగా ఉంది కదూ పిల్లలూ...!!