బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్లను నిరోధించగలిగే శక్తి ఉన్న జాకెట్. ప్రస్తుతం హింస పెరిగిపోతున్న కారణంగా బుల్లెట్ల నుంచి రక్షణ పొందేందుకు కొంత మంది నాయకులు, మిలటరీ కమెండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ధరించి విధులను నిర్వహిస్తారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పది మీటర్ల దూరం నుంచి వచ్చే బుల్లెట్లను కూడా నిరోధించి ప్రాణహాని కలుగకుండా ఉంటుంది.
ఈ జాకట్లను నైలాన్ లేక కెవ్లాన్ ఫ్యాబ్రిక్‌తో సిరామిక్ ప్లేట్లతో తయారు చేస్తారు. పోలీసులు మూడు కిలోల బరువుండే కెవ్లార్ అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన జాకెట్లను వాడుతుంటారు. బుల్లెట్ ప్రూఫ్ స్టీల్, సిరామిక్ ప్లేట్, పాలిథైలిస్ ప్లేట్‌లతో కూడిన మూడు పొరల జాకెట్‌లను కూడా బుల్లెట్ ప్రూఫ్‌గా వాడుతారు