1. సింథటిక్ రబ్బర్ అంటే ఏమిటి?
కొన్ని రకాలైన హైడ్రోకార్బన్ల నుంచి సింథటిక్ రబ్బర్ తయారువుతుంది. వీటిలో బ్యుటాడైన్ అత్యంత ముఖ్యమైనది. ఈ హైడ్రోకార్బన్లు బొగ్గు, ముడి చమురు మరియు ఆల్కహాల్ నుంచి వెలువడుతాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, సహజమైన రబ్బర్ కన్నా సింథటిక్ రబ్బర్‌తో మిళితమైన రబ్బర్ చమురు నిరోధకాన్ని ఆపాదించుకున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో సహజంగా తయారయ్యే రబ్బర్, సింథటిక్ రబ్బర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్నది.
2.గ్రాండ్ స్లామ్ అంటే ఏమిటి?
నిర్దేశిత క్రీడకు గ్రూప్ మ్యాచ్‌లకు, ఛాంపియన్ షిప్‌లకు మరియు అన్ని మ్యాచ్‌లను గెలుపొందడానికి గ్లాండ్ స్లామ్ అనే క్రీడానామాన్ని ఉపయోగిస్తారు. టెన్నిస్ క్రీడకు చెందిన గ్లాండ్ స్లామ్‌లు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి (ది ఆస్ట్రేలియా ఓపెన్, ది ఫ్రెంచ్ ఓపెన్, బ్రిటీష్ ఓపెన్, వింబుల్డన్ మరియు యూఎస్ ఓపెన్), గోల్ఫ్ (ది యూఎస్ ఓపెన్, ది బ్రిటీష్ ఓపెన్, ది మాస్టర్స్ మరియు ది పీజీఏ), మరియు రగ్బీ యూనియన్ (ఇంగ్లాండ్ వేల్స్, ఫ్రాన్సు, ఐర్లాండ్ మరియు స్కాట్‌ల్యాండ్‌ల మధ్య జరిగిన పోటీలలో సాధించిన విజయాలు.