ప్రపంచంలో 242 భాషలున్న అతి పేద దేశం...
తొమ్మిది దేశాల సరిహద్దుల్లో.. సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా కూర్చున్న మునిలాగా ఉండే ఈ దేశంలోని ప్రజలు 242 భాషలు మాట్లాడతారు. జనాభా పరంగా చూస్తే.. పందొమ్మిదోది, ఆఫ్రికా దేశాల్లో మూడోది.. అయిన ఈ దేశం పేరు "డెమొక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో". ఇంత పెద్ద పేరుతో దీన్ని పిలవటం కష్టంగా అనిపిస్తే.. మనం "డీఆర్ కాంగో" అని ముద్దుగా కూడా పిల్చుకోవచ్చు.అంతేగానీ కాంగో అని మాత్రం పిలవకూడదు. ఎందుకంటే రిపబ్లికన్ ఆఫ్ కాంగో అనే వేరే దేశం ఉంది. పైగా ఈ రెండు దేశాలూ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి, కాస్త జాగ్రత్తగానే పిలవాల్సి ఉంటుంది. ఆ సంగతలా కాసేపు పక్కన పెట్టేస్తే.. ఈ డీఆర్ కాంగో రాజధాని నగరం కిన్షానా. ఈ దేశంలోని ప్రజలు 242 భాషలు మాట్లాడతారు. అయితే, అధికార భాష మాత్రం ఫ్రెంచ్. వీటితోపాటు లింగాలా, కింగ్వానా అనే రెండు అధికారిక భాషలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో రోమన్ కేథలిక్, ప్రొటెస్టాంట్, ఇస్లాం అనే మూడు రకాల మతాలున్నాయి.
ఈ పేద దేశంలో సుమారు 52 లక్షల మంది పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారట. అక్కడి పేదరికంవల్ల వారి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని కారణంగానే చదివించలేకపోతున్నారు. ఇక ప్రజల ఆరోగ్య పరిస్థికి కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాగే రోడ్లు, నీటివసతులకు...
ఇక ఈ దేశం సరిహద్దుల విషయానికి వస్తే.. 9 దేశాల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇది తొమ్మిది దేశాల సరిహద్దుల్లో ఓ సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా కూర్చొన్నట్లుగా ఉంటుంది. కాబట్టి.. రిపబ్లికన్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సూడాన్, ఉగాండా, ర్వాండా, బురుండి, టాంజానియా, జాంబియా, అంగోలా దేశాల సరిహద్దులతో.. అట్లాంటిక్ సముద్రం తీరంలో 40 కిలోమీటర్ల మేర ఆవరించి ఉంది డీఆర్ కాంగో.ఏదేని దేశం ఆర్థిక పరిస్థితిని లెక్కగట్టాలంటే దాని స్థూల జాతీయోత్పత్తిని బట్టి నిర్ణయిస్తారని తెలిసిందే కదూ పిల్లలూ..! అలా డీఆర్ కాంగో జాతీయోత్పత్తిని లెక్కగడితే కేవలం 300 డాలర్లుగా ఉంది. ఉదాహరణకు మన దేశం జీడీపీ 2,700 కాగా, చైనాది 5,400. అలా ప్రపంచంలోని అన్ని దేశాలకంటే డీఆర్ కాంగో చాలా తక్కువ జీడీపీని కలిగి ఉంది. కాబట్టి.. దీన్ని ప్రపంచంలోని అతి పేద దేశంగా ప్రపంచబ్యాంక్ లెక్కగట్టింది.ఇక ఈ దేశ జనాభా విషయానికి వస్తే.. 68,692,542. మొత్తం భూభాగం 2,345,410 చదరపు కిలోమీటర్లు. అంటే ఒక చదరపు కిలోమీటర్‌కు దాదాపు 30 మంది నివసిస్తున్నారు. ఈ డీఆర్ కాంగోలో కాఫీ, షుగర్ పామ్ ఆయిల్, రబ్బర్, తేయాకు, అరటిపళ్లు.. ప్రధానంగా పండించే పంటలు. మొత్తం అక్షరాస్యతా శాతం చూస్తే 67 మాత్రమే..!ఈ పేద దేశంలో సుమారు 52 లక్షల మంది పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారట. అక్కడి పేదరికంవల్ల వారి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని కారణంగానే చదివించలేకపోతున్నారు. ఇక ప్రజల ఆరోగ్య పరిస్థికి కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాగే రోడ్లు, నీటివసతులకు కూడా ఈ దేశం దూరమే. అందుకనే యూరోపియన్ దేశాల సంయుక్త విమానాశ్రయాల కమీషన్ ఇక్కడికి విమానాల రాకపోకలను కూడా నిషేధించింది.