పెంగ్విన్లు గంటకు ఎంత వేగంతో ఈదగలవు?
, గురువారం, 22 డిశెంబరు 2011 (17:32 IST)
పెంగ్విన్లు మంచు, నీరు అధికముగా ఉండే ప్రదేశములలో ఎక్కువగా నుండును. పెంగ్విన్ల శరీరం భారీగా ఉంటుంది, కాబట్టి మిగిలిన పక్షులలాగా తేలిగ్గా ఎగరలేవు, కానీ నీటీలో చాలా సేపు ఈదగలవు. కొన్ని జాతుల పెంగ్విన్లు గంటల తరబడి నీటిలో గడుపుతుంటాయి. పెంగ్విన్లు చాలా వేగంగా ఈదుతాయి.ఇవి సాధారణంగా గంటకు 15 నుంచి 24 కిలో మీటర్లు దూరం ఈత కొడతాయి. ఇది ఒక మనిషి పరిగెత్తగలిగిన అత్యధిక వేగంతో సమానం. గుడ్లు పెట్టడానికి, ఈకలు రాల్చటానికి తీరానికి వస్తుంటాయి. ఇవి గంటకు ఇరవై ఏడు కిలోమీటర్ల వేగంతో కూడా ఈత కొట్ట గలవు.అయితే ఒక్కొక్క జాతి పెంగ్విన్ వేగం ఒక్కోరకంగా ఉంటుంది. పెంగ్విన్లు లోతుగా డైవే చేయగలవు. గెంటు పెంగ్విన్లు 210 మీటర్ల 688 అడుగులు లోతు డైవ్ చేయగలవు, ఎంపరర్ రకం పెంగ్విన్లు 535 మీటర్ల 1755 అడుగులు, కింగ్ పెంగ్విన్లు 325 మీటర్ల 1059 అడుగులు లోతు డైవ్ చేయగలవు.