పిల్లలూ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి జంతువులేవి?
, గురువారం, 6 అక్టోబరు 2011 (11:49 IST)
అంతరిక్షంలోకి మానవుల కంటె ముందుగా జంతువులను పంపించారు. 1957 నవంబర్ 3న యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) ప్రయోగించిన 'స్ఫుత్నిక్ 2' అనే ఉపగ్రహంలో 'లైకా' అనే కుక్క అంతరిక్షంలో అడుగు పెట్టింది. అంతరిక్షంలోకి మొట్టమొదట వెళ్లిన జంతువు ఇదే.దానిని వెనక్కి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో అది పది రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత అక్కడే చని పోయింది. ఏబుల్, బేకర్ అనే ఆడకోతులను 1959 మే 28న అమెరికా దేశం అంతరిక్షంలోకి పంపించింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కుదరక భూమి మీదికి తిరిగి వచ్చేశాయి. మానవ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఉపయోగపడే పరిశోధనల కోసం చాలా కుక్కల్ని ప్రయోగాత్మకంగా పంపించారు. 1960
ఆగష్టు 19న బెల్కా, స్ట్రెల్కా అనే రెండు ఆడకుక్కల్ని పంపించారు. ఆ తర్వాత స్ట్రెల్కా ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దానిలో ఒక దానిని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్‌కెనడీకి ఇచ్చారు. 1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ వారు ఫెలిక్స్ అనే పిల్లిని పంపించారు. ఆ తర్వాత అది భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చింది.