Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిక్సూచి ఎలా పనిచేస్తుంది..?

Advertiesment
జనరల్ నాలెడ్జ్
FILE
మనకు పరిచయం ఉండే ప్రాంతాలలో నడుచుకుంటూ వెళుతుంటే తెలిసిన ప్రదేశాలు, వీధుల పేర్లు దారి చూపుతాయి. అదే కొత్త చోటికి వెళితే అది సాధ్యంకాదు. అలాంటప్పుడు మనం ఏ దిశగా వెళ్లాలి అనేది ముందు నిర్ధారించుకుంటే.. "అయస్కాంత దిక్సూచి" సహాయంతో సులభంగా దారి కనుక్కోవచ్చు. ఎలాగంటే... ఈ దిక్సూచి భూమి అయస్కాంత శక్తిని ఉపయోగించుకుని దిక్కులను చూపిస్తుంది కాబట్టి..!

సాధారణంగా అయస్కాంతం అంటే.. ఏదేని ఇనుప ముక్కలను గట్టిగా కరచుకునేదని మాత్రమే మనందరికీ తెలుసు. అయితే భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతంలాగా పనిచేస్తుంది తెలుసా..? అన్ని అయస్కాంతాలలాగే భూమికి ఉండే అయస్కాంత శక్తికి బలంగా ఉండే రెండు క్షేత్రాలు ఉంటాయి. వీటినే ఉత్తర-దక్షిణ అయస్కాంత క్షేత్రాలని పిలుస్తారు. అయితే.. ఈ అయస్కాంత ధ్రువాలు భౌగోళికమైన ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఒకటి కావని మాత్రం గుర్తు పెట్టుకోవాలి.

అన్ని అయస్కాంతాలలాగే భూమి అయస్కాంత ధ్రువాలలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అయితే ఇది మన కంటికి కనిపించదు. ఈ క్షేత్రాన్ని దాటి దాని స్థానాన్ని, బలాన్ని సూచిస్తుంటాయి. అయస్కాంత ధ్రువాల దగ్గర ఈ రేఖలు కలుసుకునేచోట అయస్కాంత క్షేత్రం బలంగా ఉంటుంది.
ఎలా వాడాలంటే..?
మనం నిలబడ్డ చోటు నుంచి ఒక గది తూర్పు దిశగా ఉందని అన్నప్పుడు.. అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు.. మొదట దిక్సూచిని అందులోని అడుగుభాగాన్ని మనకు నేరుగా ఎదురుగా ఉండేటట్లు పట్టుకోవాలి. ఆ తర్వాత బాణం గుర్తు ఇ వైపు చూసేదాకా తిప్పుతూ ఉండాలి...
webdunia


కాబట్టి.. భూమి అయస్కాంత క్షేత్రంవల్లనే దిక్సూచి పనిచేస్తుంది. ఈ దిక్సూచిలో అయస్కాంతీకరించిన, సులువుగా తిరగగలిగే ఉక్కు ముల్లు ఉంటుంది. దీని అడుగు భాగం పారదర్శకంగా ఉంటుంది. దాని డయల్ కదిలేందుకు అనువుగా ఉంటుంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు పడమరలను గుర్తించేందుకు వీలుగా దిక్సూచిపై ఎన్, ఎస్, ఇ, డబ్ల్యూ అనే గుర్తులు ఉంటాయి.

డయల్ మీద నంబర్లు ఉంటాయి. అవి వృత్తాన్ని కొలిచేందుకు అనువైన డిగ్రీలు. వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి. దిక్సూచిలోని సూది పారదర్శకమైన ద్రవంలో కదులుతూ ఉంటుంది. ఈ ద్రవపదార్థం సూది త్వరగా ఆగేందుకు ఉపయోగపడుతుంది. దిక్సూచిలోని సూది సాధారణంగా ఎర్రగా ఉంటుంది. అది ఉత్తర దిక్కును సూచిస్తుంది. దిక్సూచిలోని ముల్లు అయస్కాంత ఉత్తర దిశను సూచిస్తుంది. దాని ఆధారంగా మనం ఉత్తర దిశగా వెళ్లవచ్చు.

దిక్సూచిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. మనం నిలబడ్డ చోటు నుంచి ఒక గది తూర్పు దిశగా ఉందని అన్నప్పుడు.. అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు.. మొదట దిక్సూచిని అందులోని అడుగుభాగాన్ని మనకు నేరుగా ఎదురుగా ఉండేటట్లు పట్టుకోవాలి. ఆ తర్వాత బాణం గుర్తు ఇ వైపు చూసేదాకా తిప్పుతూ ఉండాలి.

తర్వాత దిక్సూచిని ఒక స్థాయిలో ఉంచి అయస్కాంత సూది డయల్ మీద ఉన్న బాణం గుర్తుదాకా వచ్చేవరకు మన శరీరాన్ని కదిలించాలి. అప్పుడు దిక్సూచి అడుగున ఉన్న బాణం గుర్తు తూర్పు దిశకు ఉంటుంది. అంటే ఉత్తరానికి 90 డిగ్రీలలో ఉంటుంది. ఆ బాణం గుర్తు ఉన్న దిశగా వెళ్తే సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu